తాడేపల్లి : కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణమన్న సంగతి అందరికీ తెలుసని, కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో ఎట్టిన వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుదాకర్‌బాబు విమర్శించారు. ఇప్పుడు ఏకంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు వచ్చారని, తమ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి నోటీసులు ఇచ్చారన్నారు.
ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన సుధాకర్ బాబు.. ‘ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము, కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?, మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది, విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?,
ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?, దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి పుస్తకం మధ్యలో డ్రగ్్ పెట్టుకుని వచ్చాడు. ఆయన అక్షయ కుమార్ అనే వ్యక్తికి ఇస్తుండగా ఈగల్ టీమ్ పట్టుకుంది. అదే రోజు ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో కూటమి ఎమ్మెల్యేల కుమారులు ముగ్గురు ఉన్నారు. ఈ విషయం తెలియగానే ముగ్గురిని ఎందుకు వదిలేశారు?, హోంమంత్రి అనిత ఈ విషయాలపై ఎందుకు మాట్లాడటం లేదు?, వారిని వదిలేసేంత వరకు కూటమి ఎమ్మెల్యేలు సీపీ ఆఫీసులో కూర్చోలేదా?., ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు మాపార్టీ కార్యకర్త కొండారెడ్డి పై కేసు పెట్టారు. కొండారెడ్డిని అరెస్టు చేసిందెక్కడ? అతను నివసించేది ఎక్కడ?, సీసీ కెమెరాలో పోలీసుల వైఖరి తేలిపోయింది. ఇలాంటి అకృత్యాలకు చెక్ పడే సమయం దగ్గర్లోనే ఉంది’ అని ధ్వజమెత్తారు.


