బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌ | Threatening UP Voters: ECI Orders FRI Against MLA Raja Singh | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌

Feb 19 2022 8:13 PM | Updated on Feb 19 2022 8:13 PM

Threatening UP Voters: ECI Orders FRI Against MLA Raja Singh - Sakshi

సాక్షి, ఢిల్లీ:  హైదరాబాద్‌ గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.  

అంతే కాదు 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని రాజాసింగ్‌పై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులుపై జవాబు చెప్పేందుకు సమయం కావాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి ఓటు వేయకుంటే జేసీబీలు, బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే  రాజా సింగ్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement