దళితబంధును అడ్డుకున్నాయి

Telangana: Revanth Reddy Comments On BJP And TRS Over Dalith Bandhu - Sakshi

టీఆర్‌ఎస్, బీజేపీలపై రేవంత్‌రెడ్డి ధ్వజ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బీజేపీ–టీఆర్‌ఎస్‌లు కలిసే దళితబంధును అడ్డుకున్నాయని, తాను గాడ్సే కాదని అసలైన గాడ్సే అమిత్‌షానే అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం బీజేపీ–టీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ చేసి, ఇక్కడ కుస్తీలు పట్టేవారని, ఇప్పుడు మాత్రం రెండు చోట్లా కలిసిపోయారని ఆరోపించారు.

పెట్రోలు, గ్యాస్, వంటనూనె ధర లు పెరుగుతున్నా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నిం చడం లేదని టీఆర్‌ఎస్‌ను నిలదీశారు. భూపంచాయతీల్లో విభేదాలు రావడం వల్లే రాజేందర్‌ రాజీనామా, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. 20 ఏళ్లు స్నేహితుడిగా ఉన్న రాజేందర్‌ ఇప్పుడు దొంగ ఎలా అయ్యారని మంత్రి హరీశ్‌ను ప్రశ్నిం చారు. కరీంనగర్‌ జిల్లాకు హుజూరాబాద్‌కు కేసీఆర్‌ చేసిందేమీ లేదన్నారు. ఎస్సారెస్పీ కాలువలు,  ఇం దిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తుచేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాడిన బల్మూరి వెంకట్‌ సరైన అభ్యర్థి అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని 30న హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.

రాజేందర్‌ను బీజేపీలోకి పంపింది కేసీఆరే.. 
వీణవంకలో జరిగిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ‘గోల్కొండ రిసార్ట్స్‌లో ఈటల, రేవంత్‌ రహస్యంగా భేటీ అయ్యారని ఓ సన్నాసి అంటుండు. మేం కలుసుకుంది మే 7న. వేం నరేందర్‌రెడ్డి కొడుకు లగ్గం కోటు సందర్భంగా చాలా మంది వచ్చిండ్రు. అక్కడ ఈటలను కలుసుకున్నది వాస్తవమే’అని అన్నారు. రాజేందర్‌ను బీజేపీలోకి పంపించిందే కేసీఆర్‌ అని సంచలన ఆరోపణలు చేశారు.  

సభకు హాజరైన జనం. (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న రేవంత్‌. చిత్రంలో బల్మూరి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top