Sakshi News home page

అమిత్‌ షాతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక భేటీ

Published Sun, Sep 17 2023 8:17 AM

Telangana Liberation Day BJP Events Live Updates - Sakshi

Updates..

► తెలంగాణలో పార్టీ కార్యవర్గంపై అమిత్‌ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోఆర్డినేషన్‌పై పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని పోవాలని నాయకులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు.  

► కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటించి సమర్పించిన నివేదికలపై ప్రస్తుతం జరిగిన భేటీలో చర్చించారు. తెలంగాణ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో సంచరించి ఓ నివేదికను రాష్ట్ర అధిష్ఠానానికి సమర్పించిన విషయం తెలిసిందే.   

► అమిత్‌ షా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. ఉస్మానియాలో వందేమాతం పేరుతో ఆందోళనలు జరిగాయి. పటేల్‌ లేకుంటే తెలంగాణకు విమోచనం కలిగేది కాదు. తెలంగాణ ప్రజలపై జనరల్‌ డయ్యర్‌ బుల్లెట్ల వర్షం కురిపించారు. రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవసాక్ష్యంగా నిలుస్తుంది. పరకాలలో అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ చరిత్రను 75ఏళ్ల పాటు వక్రీకరించారు. 

► చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌కు అంతర్జాతీయ కీర్తి. డిజిటల్‌ రంగంలో భారత్‌ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్‌ వక్రీకరించింది. మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సవరించాం. ఈరోజు మోదీ పుట్టినరోజు సేవాదివస్‌గా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించడానికి కారణాలున్నాయి. భవిష్యత్‌ తరాలకు నాటి పోరాటయోధులను గుర్తుచేయడం, పోరాట యోధులను సన్మానించడమే అని అన్నారు. 

► పారామిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించిన అమిత్‌ షా. 

►  సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళులర్పించిన అమిత్‌ షా.

► జాతీయ జెండా ఎగురవేసిన అమిత్‌ షా. 

► వార్‌ మెమోరియల్‌ వద్ద నివాళులర్పించిన అమిత్‌ షా. 

► తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమిత్‌ షా నివాళులు అర్పించారు. అనంతరం, గౌరవ వందనం స్వీకరించారు. 

► కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. 

► పరేడ్‌ గ్రౌండ్‌ చుట్టూ సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరించాయి. 

► తెలంగాణ బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ చీఫ్‌  కిషన్‌రెడ్డి.. ఆదివారం ఉదయం పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. 

► ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ.. ప్రతీ ఏడాది పార్టీ ఆఫీసుల్లో వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణ ‍ప్రజలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేస్తోందన్నారు.  నిజాం​ సైన్యం అనేక మందిని ఊచకోత కోసింది. తెలంగాణకు 13 నెలలు స్వాతంత్ర్యం ఆలస్యంగా వచ్చింది. ఎంతో మంది బలిదానంతో తెలంగాణకు స్వేచ్చ లభించింది. 

► తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. 

► ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది.

► ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్‌ గ్రౌండ్‌, ఇటు పబ్లిక్‌ గార్డెన్స్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌, నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

► ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement