
సాక్షి, హైదరాబాద్: విజయ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 1025 కి.మీ మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు కొనసాగుతాయని తెలిపారు.
33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు నిర్వహిస్తామన్నారు. యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామన్న కిషన్‌రెడ్డి.. పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణలో 17 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎంను మట్టి కరిపిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ