
Telangana Assembly Elections Today Minute To Minute Update
- రేపు మంచిర్యాల, రామగుండం,ములుగు భూపాలపల్లిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం
ముషీరాబాద్‌లో రేవంత్ కామెంట్స్..
- ముషీరాబాద్ ప్రజలకు అండగా ఉండే వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్.
- మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అంజన్ కుమార్ యాదవ్ అందుబాటులో ఉంటారు.
- అంజన్ కుమార్‌కు నాకు ఉన్న బంధం కుటుంబ అనుబంధం
- కాంగ్రెస్‌ను ఆశీర్వదించేందుకు ముషీరాబాద్ ప్రజలే కాదు.. వరుణ దేవుడు కూడా వచ్చాడు.
- అంజన్ను గెలిపిస్తే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు.
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది.
- మహిళలకు ప్రతీ నెల రూ.2500 అందిస్తాం
- రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం
- ఇల్లు కట్టుకునే పేదవాడికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందిస్తాం
- ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం
- ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం.
- కేసీఆర్ ఉంటే పెన్షన్ రూ.2వేలే.. కేసీఆర్‌ను బొందపెడితే రూ. 4వేలు పెన్షన్
రేపు, ఎల్లుండి ప్రచారంలో డీకే శివకుమార్
- కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం
- రేపు, ఎల్లుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న శివకుమార్
- రేపు స్టేషన్ ఘన్‌పూర్ , వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, అంబర్ పేట నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్న డీకే
- ఈనెల 25న హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొననున్న డీకే శివ కుమార్.
పటాన్‌చెరులో కేసీఆర్ కామెంట్స్..
- రాబోయే ఐదేళ్ల భవిష్యత్ ప్రజల చేతుల్లో ఉంది.
- త్వరలో పటాన్‌చెరు నియోజకవర్గం ఐటీ హబ్‌గా మారబోతుంది.
- పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందిస్తున్నాం.
- పరిశ్రమల్లో కాలుష్యం తగ్గడానికి కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం.
- మాకు ఢిల్లీలో బాస్ ఉండడు.. ప్రజలే మాకు బాసులు.
- మళ్లీ బీఆర్‌ఎస్ వస్తే అసైన్డ్ భూములను క్రమబద్దీకరణ చేస్తాం.
- మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో తప్పకుండా వస్తుంది
- మహిపాల్ రెడ్డి ప్రజల మనిషి.
- ఎప్పటి వరకు కేసీఆర్ ఉంటాడో అప్పటి వరకు సెక్యులరిజం ఉంటుంది.
రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన..
- ఈ నెల 24, 25 తేదీల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రియాంక.
- రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తిలో సభకు హాజరుకానున్న ప్రియాంక
- మధ్యాహ్నం 1:30 గంటలకు హుస్నాబాద్‌లో పర్యటన
- సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక.
- రేపు ఖమ్మంలో రాత్రి బస చేయనున్న ప్రియాంక గాంధీ
- శనివారం 25వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఖమ్మం, పాలేరులో ఎన్నికల ప్రచారం
- మధ్యాహ్నం 1:30 గంటకి సత్తుపల్లిలో ప్రచారం
- మధ్యాహ్నం 2:40 నుండి 3:30 గంటల వరకు మధిర ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక.
- అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి ప్రియాంక.
రేపు మూడు నియోజకవర్గాల్లో అమిత్ షా రోడ్ షో
- రేపు రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేటలో అమిత్ షా రోడ్ షోలు
- మధ్యాహ్నం 12:15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్న అమిత్ షా
- మధ్యాహ్నం 1:10 నుంచి 1:50 గంటల వరకు ఆర్మూరు అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్న అమిత్ షా
- మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:40 గంటల వరకు రాజేంద్ర నగర్‌లో రోడ్ షోలో పాల్గొననున్న అమిత్ షా
- సాయంత్రం 4:10 నుంచి 4:50 వరకు శేరిలింగంపల్లిలో రోడ్ షో
- సాంయత్రం 5:30 నుంచి 6:10 గంటల వరకు అంబర్‌పేట్ నియోజక వర్గంలో రోడ్ షో
- సాయంత్రం 6:40 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి ప్రయాణం
దేవరకొండ రోడ్ షోలో మంత్రి కేటీఆర్
నల్లగొండ జిల్లా:
- దేవరకొండ మున్సిపాలిటీ లో 100 కోట్లతో అభివృద్ధి చేశాం
- వందల కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం
- కాంగ్రెస్‌కు 11 సార్లు చాన్స్‌లు ఇస్తే ఎం చేశారు?
- ఢిల్లీ పార్టీలు చాలా డేంజర్
- తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న కమిట్మెంట్ కాంగ్రెస్ వాళ్లకు ఉండదు
- కేసీఆర్‌ను ఎలాగైనా కట్టడి చేయాలని ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు
- మూడోసారి గెలిచి, ఢిల్లీలో గులాబీ జెండా ఎగరేస్తారని ఢిల్లీ పెద్దలకు భయం పట్టుకుంది
- సింహం సింగిల్‌గా.. కేసీఆర్ సింహం లాంటి వారు
- ఆడబిడ్డలకు సౌభాగ్య లక్ష్మీ పథకం కింద మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం
- వృద్ధులకు రూ. 5 వేలు పెన్షన్‌లు ఇస్తాం
- సిలిండర్‌ను రూ. 400కే ఇస్తాం
- రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు సన్నబియ్యం ఇస్తాం
- అసైన్డ్ భూములకు మొత్తం హక్కులు ఇస్తాం
- కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ ఖతం అవుతుంది
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
- ఆనంద్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ మహిళా ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన స్మృతి ఇరానీ
- దళిత బందు కేసిఆర్ కమీషన్ బందుగా మారింది
- తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు
- కేసీఆర్ పెద్దపెద్ద హెర్డింగ్‌లు పెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు
- బీజేపీని గెలిపిస్తే ఏటా నాలుగు సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది
- విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందజేయడం జరుగుతుంది
- అయోధ్యలో రామమందిరం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఏనాడైనా కృషిచేశాయా?
- బీజేపీ ద్వారానే రామమందిరం నిర్మాణం అయ్యింది
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తాం
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దు
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తాం
- కాంగ్రెస్-బీఆర్‌ఎస్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దు
- బీజేపీ ద్వారానే ధర్మం, న్యాయం కాపాడుతుంది
- ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రజలకు మేలు జరుగుతుంది
మీడియాతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్
- తెలంగాణలో ప్రస్తుతం మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు
- యువ ఓటర్లు 9,99, 677 మంది ఉన్నారు
- తెలంగాణలో పోలింగ్ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి
- ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా వేగంగా జరుగుతోంది
- బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ మొదలైంది
- ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం
- 36వేల ఈవీఎంలను సిద్ధం చేశాం
- ప్రతీ కౌంటింగ్ సెంటర్‌కూ ఒక అబ్జర్వర్ ఉంటారు
- తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు
సంగారెడ్డికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన
- బీజేపీ అభ్యర్థి పులి మామిడి రాజుకి మద్దతుగా ప్రచారం
- సంగారెడ్డిలోని గంజి మైదానం లో జేపీ నడ్డా బహిరంగ సభ
కరెంట్ కావాలో కాంగ్రెస్ రావాలో మీరే నిర్ణయించుకోండి: కేటీఆర్
- మంత్రి కేటీఆర్ సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం
- హుజూర్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తరపున రోడ్డు షోలో పాల్గొన్న కేటీఆర్
- కేటీఆర్ కామెంట్స్..
- రెండేళ్లలో సైదిరెడ్డి చేసిన పని.. రెండు సార్లు మంత్రిగా ఉన్న ఉత్తమ్ చేయలేదు.
- ఉప ఎన్నికల్లో సీఎం హుజూర్ నగర్‌కు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు.
- తండాలు గ్రామపంచాయితీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దే.
- సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించింది మా ప్రభుత్వమే.
- కరెంట్ కావాలో కాంగ్రెస్ రావాలో మీరే నిర్ణయించుకోండి
- కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్‌లో కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నవాళ్లు ఈరోజు ఎంతమంది పోటీ చేస్తున్నారు
- అక్కడ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేదు మిగతా గ్యారెంటీలకు గ్యారెంటీయే లేదు
- స్కాములు చేయాలి రాష్ట్రాన్ని మింగేయాలి ఇదే కాంగ్రెస్ నినాదం.
- రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అంటాడు
- ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని చెబుతున్నాడు.
- భట్టి విక్రమార్క ధరణి రద్దు చేస్తా అంటాడు. ఇలాంటి వాళ్ళకా మనం ఓట్లు వేసేది
సంగారెడ్డి ప్రచారంలో కాంగ్రెస్ నేతలపై హరీష్‌రావు ఫైర్
- కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు
- కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని రేవంత్‌రెడ్డి అంటున్నారు
- గెలవకపోతే దేనికైనా సిద్ధం అంటున్నారు
- కానీ, గత ఎన్నికల్లోనూ రేవంత్ ఇలాగే అన్నారు
- కొడంగల్‌లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ అన్నారు
- మరి ఓడారు కదా.. సన్యాసం ఎందుకు తీసుకోలేదు
- ఉత్తమ్‌కుమార్ ఏమో గెలవకపోతే గడ్డం తీయనన్నారు
- సంగారెడ్డిలో గెలిచి.. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి ఉంటున్నాడు
- జగ్గారెడ్డి సీఎం అవుతారట.. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఈసారి గెలవరు
వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
- ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి
- ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిస్థితి ఇంకా రాలేదు
- ఎన్నికలు వచ్చాయని ఆగం కాకండి
- అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను గమనించండి
- తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్ పుట్టింది
- గత పదేళ్లుగా జరిగిన అభివృద్ధి చూడండి
- ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నో అబద్ధాలు చెబుతారు
- ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకండి
- మీకు ఓటే ఆయుధం
- గతంలో కరెంటు, నీళ్లు ఎలా ఉండేవి?
- ఎంతో పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం
- ఉన్న తెలంగాణ ఊడగొట్టింది కాంగ్రెసే
- పేదల సంక్షేమ కోసం బీఆర్‌ఎస్ పని చేస్తోంది
- కాంగ్రెస్ జమానాలో రూ. 200 ఫించన్ ఉండేది
- పెన్షన్ తమాషాకు ఇవ్వడం లేదు
- సమాజంలో విధి వంచితులైన వారు ఉంటారు
- వారి కోసమే పెన్షన్ అనేది సరైన రీతిలో ఉండాలనే ఆలోచన చేశాం
- ఇప్పుడు పెన్షన్‌ను రూ. 5వేలకు తీసుకుపోతున్నం
గచ్చిబౌలిలో భారీగా పట్టుపడ్డ నగదు
- గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును సీజ్ చేసిన మాదాపూర్ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు
- కొండాపూర్ బొటానికల్ రోడ్ నుండి చిరెక్ పబ్లిక్ స్కూల్ పైపు బ్రీజా కార్లో నగదును తరలిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు
- అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా కారులో రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల నగదును గుర్తించిన పోలీసులు
- పట్టు పడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తింపు
- ఆ నగదును ఐటి శాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు.
మహేశ్వరం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
- మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గెలుపు ఖాయమైంది
- సబితా ఇంద్రారెడ్డి కారణంగానే కందుకూరులో మెడికల్ కాలేజీ వచ్చింది
- పట్టుబట్టి కందుకూరుకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు
- తుక్కుగూడలో ఇటీవల 52 కొత్త పరిశ్రమలు వచ్చాయి
నిజామాబాద్ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుంది
- కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదు
- కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి ఉండదు
- తెలంగాణ ప్రగతి వెనుకబడి పోయింది
- అత్యధిక మైనారిటీలు తెలంగాణలో ఉన్నారు
- ధరణి పోర్టల్ కేసీఆర్ ఆక్రమణలకు పోర్టల్ గా మారింది
- కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం గా మారింది
- దళితబందు లాంటి పథకాలు బీఆరెస్ కార్యకర్తలకే ఇచ్చారు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఊహా లోకంలో కట్టారు
- ప్రధాని ఇక్కడ పసుపు బోర్డు ప్రకటించారు.. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది
- బీజేపీని గెలిపించండి.. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం
కుటుంబ పాలన మనకు అవసరం లేదు: విజయశాంతి
- కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వరంగల్‌లో ఎన్నికల ప్రచారం
- కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి
- బీఆర్ఎస్ పాలన అవినీతిమయంగా మారింది.
- రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్స్ ఇండ్లు నిర్మించి అర్హులకు ఇవ్వలేదు.
- ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకున్నాడు.
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు.
- కుటుంబ పాలన మనకు అవసరం లేదు.
- లిక్కర్ కేసులో కవితను కాపాడుకున్నారు.
- బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే.
- ఓరుగల్లు ప్రజలు చైతన్యవంతులు.. అయినా కేసీఆర్ మోసం చేశారు.
- ఈసారి కేసీఆర్ కుటుంబానికి ఓటుతో బుద్ధి చెప్పండి.
- కేసీఆర్‌ను గద్దెద్దించండి.
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి.
- రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.
- తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ.
- కేసీఆర్ ఉద్యమం పేరుతో తెలంగాణ మొత్తం దోచుకున్నాడు.
- కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది.
- బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు.
- పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.
- కాంగ్రెస్ అధికారంలో వస్తే గ్యాస్ రూ.500లకే అందిస్తాం.
- మొదటి మంత్రి వర్గంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం.
- రైతులకు, కౌలు రైతులకు రూ.15వేల రూపాయలను పెట్టుబడి సహాయం చేస్తాం.
- వరి ధాన్యంకు రూ.500 బోనస్ అందిస్తాం.
- యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
- ఖాళీ స్థలం ఉన్న వారికి రూ.5లక్షలను ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ఇస్తుంది.
- కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. కేసీఆర్‌కు పోటు పొడవండి.
సీఎం కేసీఆర్ మాట తప్పారు: మాజీ సీఎం నారాయణ స్వామి
- పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి కాంగ్రెస్ తరఫున కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం
- 10 సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
- దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పడు.
- దేశంలోనే సచివాలయలానికి పోకుండా ఇంటి నుంచి పని చేసే ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
- ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మాట తప్పి, నిరుద్యోగ భృతిని ప్రకటించలేదు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం.
కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు: పీయూష్ గోయల్
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వికారాబాద్‌లో ప్రచారంలో పాల్గొన్నారు.
- కేసీఆర్ కుటుంబ పాలనకు సమయం ముగిసింది.
- తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఓడించబోతుతున్నారు...
- కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు.
- ప్రాజెక్ట్‌లలో అవినీతి చేశారు.
- నాణ్యత లేకుండా ప్రాజెక్ట్‌లు నిర్మించారు.
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసే రాజకీయాలను చేస్తున్నాయి.
- తెలంగాణలో బీజేపీయేతర ప్రభుత్వం ఉన్నప్పటికీ మోదీ అభివృద్ధికి సహకరించారు
- మోదీ హయాంలో విదేశీ మారకం విలువ రికార్డ్ స్థాయిలో పెరిగింది
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది
- మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
- ముస్లిం రిజర్వేషన్లపై ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు
- తెలంగాణ సమాజం ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో లేదు.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక రైలు ప్రమాదాలు తగ్గాయి
- ప్రయాణ సమయం తగ్గింది
- రైల్వేలు మరింత విస్తరిస్తాం.
- ఫార్మ్ హౌస్‌లో ఉండి కేసీఆర్ పరిపాలన చేసారు
- కేసీఆర్ శాశ్వతంగా ఫార్మ్ హౌస్‌కే పరిమితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
బాస్మతి బియ్యం ఇస్తామంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
- ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సన్న బియ్యం ఇస్తానంటే..
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఏకంగా బాస్మతి బియ్యం ఇస్తామంటూ హామీ
- రసమయి హామీతో అవాక్కవుతున్న ఓటర్లు
ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు.. యువ ఓటర్లతో కవిత
- నిజామాబాద్‌లో విద్యార్థులు ,కొత్త ఓటర్లలతో ఎమ్మెల్సీ కవిత ముఖాముఖి
- ఎన్నికలు అనగానే ఒక బ్రహ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలి
- ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు
- యువత లో చైతన్యం రావాలి
- స్వేచ్ఛ యుతంగా ఉండటం అనేది ముఖ్యం
- ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడు కోవాలి
- ప్రశ్నించటం తెలంగాణ రక్తం లోనే ఉంది
- దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు దేశ ప్రజల స్వేచ్ఛను హరించారు
- ప్రపంచం లో అత్యధిక జనాభా గల దేశం ఇండియా
- యువత తమ వాయిస్ ను వినిపించేందుకు ఉన్న సోషల్ మీడియా ను వాడుకోవాలి
- తప్పుడు ప్రభుత్వాలు అధికారం లోకి వస్తె ,దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతాయి
- యువత భవిష్యత్ పై ప్రభావం ఉంటది
- దేశం లో ఎరాష్ట్రం లో కూడా అడవుల శాతం పెరగలేదు..కానీ తెలంగాణ లో మా ప్రభుత్వ సంకల్పం వల్ల ఇది సాధ్యం అయింది
- సైనికులు బార్డర్ లో నిలబడి దేశం కోసం యుద్ధం చేస్తున్నారు..యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా?
- దేశం అభివృద్ధి జరగాలంటే ,యువత ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలి
- పట్టణాల కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది
- యువత లో చైతన్యం రావాలి
- మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుంది
- మహిళలు బాధ్యత యుతంగా ఆలోచిస్తారు
జగ్గారెడ్డి గెలిచి చేసిందేంటి?: హరీష్‌రావు
- సంగారెడ్డి ప్రచారంలో మంత్రి హరీష్ రావు
- కేసీఆర్ వచ్చాక చెట్టుకి పన్ను రద్దు చేశాం
- కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెల మామూళ్లు కట్టాలి
- కానీ కల్లు డిపోల వైపు కళ్ళెత్తి చూడకుండా చేసింది కేసీఆర్
- రాబోయే రోజుల్లో గీతా కార్మికులకు లునాలు ఇప్పిస్తం
- ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై హరీష్ తీవ్ర విమర్శలు
- జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డాడు
- ఓడిపోయినా చింతా ప్రభాకర్ జనాలతోనే ఉన్నాడు
- ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి ఒక్క ఊరు కూడా తిరగలేదు
- పని చేసే వారిని దీవించండి
- రూ. 3 కోట్లతో ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం పెడుతున్నాం
- శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గమనించాలి
బర్రెలక్క మమ్మల్ని అమెరికా నుంచి రప్పించింది
- నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ బరిలో స్వతంత్ర అభ్యర్థినిగా కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క
- నిరుద్యోగిగా.. బర్రెలు కాసుకునే వీడియోతో సోషల్ మీడియాలో వైరల్
- నిరుద్యోగుల మద్దతుతో ప్రచారంలోకి దిగిన వైనం
- శిరీష బృందంపై గుర్తు తెలియని దుండగుల దాడితో వార్తల్లోకి
- రాజకీయపరంగా మద్దతు ప్రకటించిన పలువురు
- తాజాగా అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస రావు బృందం మద్దతు
- శిరీషకు మద్దతుగా కావేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు
- అమెరికా లో ఉన్న మమ్మల్ని శిరీష రప్పించింది
- స్వచ్చందంగా.. న్యాయపరంగా మద్దతు తెలపడానికి వచ్చాము
- ఎన్నికలు పూర్తి అయిన తర్వాతే వెళతాం.
- ఆమె భద్రత కోసం ఎస్పీ ని కలుస్తాం చాలామంది వస్తున్నారు
- మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళము కాదు
- రాజకీయ ల్లో డబ్బులు ఉన్నా వాళ్లు మాత్రమే వస్తున్నారు
- బర్రెలక్క ప్రజా సేవ చేయడానికి వస్తుంది. నిరుద్యోగులకు ఉన్న బాధలు తెలుసుకుని వస్తుంది.
- ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నాము. యువత రాజకీయాల్లోకి రావాలి. మార్పు రావాలి.
- 25 సంవత్సరాలు నిండిన వెంటనే ఉద్యోగాల కోసం కాకుండా సేవ చేసుకోవడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా చాలా ఉద్యోగాలు ఉన్నాయి
మోదీ నాయకత్వంలోనే పని చేస్తా: పవన్
- కొత్తగూడెంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
- జనసైనికులు మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతు ఇవ్వాలి
- తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఎందుకు తిట్టలేదంటే.. ఏపీలో మాదిరి బాగా తిరగలేదు
- నేను లేకపోయిన తిరగకపోయిన తెలంగాణ లో పార్టీ ఉందంటే అది జన సైనికులే కారణం
- తెలంగాణ లో కూడా ఇక నుంచి పూర్తి స్థాయి లో తిరుగుతా.. ఇవాళ్టి నుంచే మొదలు పెడుతున్నా
- నమ్ముకున్న సిద్ధాంతం విషయంలో వెనుకడుగు వేసే వాడిని కాదు
- తెలంగాణ లో ఉన్న ఉద్యమ స్ఫూర్తి.. దేశమంతా ఉంటే అవినీతి ఉండేది కాదు
- రాబోయే భవిష్యత్తు యువతదే.. తెలంగాణ యువత కు జై జై లు పలుకుతున్నా
- ఏ ఆశయం తో గద్దరన్న పని చేశారో ఆ ఆశయం ను ముందుకు తీసుకు వెల్లుతా
- కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో నాకు పరిచయాలు ఉన్నాయి
- అన్ని పార్టీల నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి
- వామపక్ష పార్టీ ల నేతలు నాతో మాట్లాడినట్లు మీరు ఏ విధానం తో వెల్లుతున్నాయో జన సేన కూడా అదే విధానం తో వెల్లుతుందని చెప్పా
- రాజకీయం వేరు.. స్నేహం వేరు
- కానీ నేను మోదీ నాయకత్వంలోనే పని చేస్తా
- తెలంగాణ లో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావాలి
- తెలంగాణలో బీసీని సీఎం చేయగలిగింది బీజేపీ ఒక్కటే
- తెలంగాణలో గ్రేటర్‌లో మాత్రమే భూముల ధరలు పెరిగాయి
- తెలంగాణలో మిగతా జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది
- తెలంగాణ, ఏపీలో ప్రతిరోజు ఎన్నికల్లాగే పరిస్థితులు తయ్యారయ్యాయి
- పేపర్ లీకేజీతో ఎంతో మంది నష్టపోయారు
- ధరణి పూర్తిగా ఫెల్యూర్ అయింది
- గత పాలకులు చేసిన తప్పిదాలే పునరావృతం అవుతున్నాయి
- డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది
కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- ప్రాజెక్టులు కట్టాక చిన్న చిన్న లోపాలు జరుగుతాయి
- వాటిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయటం తగదు
- కాళేశ్వరం పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు
- అది కేవలం ఒక్క ప్రోజెక్ట్ కాదు
- అందులో 3 బ్యారేజ్ లు ఉన్నాయి
- 45 లక్షల ఎకరాలకు రెండు పంటల నీళ్ళు అందిస్తున్నాం
- 160 టీఎంసీ ల సామర్థ్యం కలదు
- 1531 కిలోమీటర్ల గ్రవేటి కెనాల్
- ప్రభుత్వం ప్రజల పై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు చేస్తాం
- గతంలో ఇతర రాష్ట్రాల్లో కట్టిన ప్రోజెక్ట్ లు కూడా ఇలాగే అయ్యాయి
- అనవసరంగా దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం తగదు
- సముద్ర మట్టానికి ఎత్తులో నీటిని తీసుకురావటం కష్టమైన పని
- అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ తోనే ఎత్తులో ఉన్న తెలంగాణ కు నీటిని తీసుకురావాలనే ఆలోచన తో కట్టింది
- తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యా నందిస్తాం
- పలకతో రండి పట్టా పోండి.. ఇది మా విద్యా విధానం
- ధరణి తీసేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి
- పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చినట్లే
- ప్రతిపక్షాలు పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని మేనిఫెస్టో లో పెట్టారు
- ఇది ప్రజలు గమనించాలి
- ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా?
- రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లెక్కలతో రండి.. చర్చకు రెడీ
- గాలి మాటలు మాట్లాడకండి
- లక్ష 60 వేల ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం
సిరిసిల్లకు స్మృతి ఇరానీ
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ రోడ్డు షో
- పాల్గొననున్న అగ్రనేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
- కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు రోడ్డు షో
- సిరిసిల్ల బీజేపీ అభ్యర్థినిగా రాణి రుద్రమ
పవన్ కల్యాణ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
- ఖమ్మం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వాహనం తనిఖీ చేసిన పోలీసులు
- కొత్తగూడెం మీటింగ్‌కు కారులో వెళ్తుండగా.. పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద ఆపి తనిఖీలు
అశ్వారావుపేట ప్రచారంలో విషాదం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో బీఆర్‌ఎస్ ప్రచారం
- మచ్చా నాగేశ్వరం ప్రచారం నిర్వహిస్తుండగా వ్యక్తి మృతి
- మల్లాయిగూడెం గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గన్నమనేని రమేష్ గుండెపోటు
- ప్రచార రథంలోనే కుప్పకూలిన గన్నమనేని.. అక్కడికక్కడే మృతి
- గ్రామంలో విషాద ఛాయలు
కేసీఆర్ తన కుటుంబానికే వడ్డించుకున్నారు: కిషన్‌రెడ్డి
- కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ
- దళితుడ్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని లేఖలో కిషన్‌రెడ్డి ప్రశ్న
- ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని లేఖలో ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని...కేసీఆర్ తన కుటుంబానికి వడ్డించారని కిషన్ రెడ్డి ఆరోపణ
- బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశ్యం కేసీఆర్ కి లేదని.. తన కుటుంబాన్ని మాత్రం బంగారు మయం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపణ
హైదరాబాద్‌పై సీఈవో సమీక్ష
- హైదరాబాద్ పరిధి పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల పై సీఈవో వికాస్ రాజ్ సమీక్ష
- హాజరైన హైదరాబాద్ జిల్లా పరిధి ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య
- పాల్గొన్న స్పెషల్ పోలీస్ నోడల్ అధికారి సంజయ్ కుమార్ జైన్
- హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1800 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు
- రిగ్గింగ్ జరగవచ్చని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఫిర్యాదులు
- ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న కౌంటింగ్ కేంద్రాల పై స్పెషల్ ఫోకస్
- ఎలక్షన్ ప్రిపరేషన్, హోం ఓటింగ్, ఫెసిలిటేషన్ సెంటర్స్ పై చర్చ
జరిగింది ఇదే.. మీకు తెలియాలి: కేటీఆర్
- తొమ్మిదిన్నర ఏళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది
- బేగంపేటలో.. మీడియాకు తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి పేరిట కేటీఆర్ ప్రజంటేషన్
- తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది
- రెవెన్యూ మండలాలూ, రెవెన్యూ డివిజన్ల సంఖ్య భారీగా పెంచాము
- అతితక్కువ ఉన్న మున్సిపాలిటీ లు సంఖ్య కూడా పెరిగింది
- కొత్త జిల్లాలు పెంచుకున్నాం
- తండాలు గ్రామ పంచాయతీ లు చేసుకున్నాం
- రాష్ట్ర తలసరి ఆదాయం 2014 లో 1,24,104 ఉన్న ఆదాయం ఇప్పుడు 3,17,115 పెరిగింది
- జీఎస్‌డీపీలో 13.27 లక్షల కోట్లకు పెరిగింది
- తెలంగాణ లో పేదరికం 13.18 % నుంచి 5.8%కు తగ్గింది
- పంట దిగుబడి 2014 కు ముందు 68 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి కానీ ఇప్పుడు 3.5 లక్షల టన్నుల దాన్యం ఉత్పత్తి అవుతోంది
- 37 వేల కోట్లతో 58 లక్షల ఇళ్లకు మంచినీళ్ళు అందించాం
- ఇంటింటికి మంచినీళ్లు అందించి తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది
- మిషన్ కాకతీయ తో 46 వేల చెరువులు బాగు చేసుకున్నాం
- సాగు నీటి ప్రోజెక్ట్ లకోసం లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టిన కొత్త ప్రోజెక్ట్ లు కట్టాం
- దీంతో తెలంగాణ పల్లెల్లో కరువు పూర్తిగా కనుమరుగు అయ్యింది
- నీళ్ళు నిధులు నియామకాలకు తగిన న్యాయం చేసింది మా కేసిఆర్ ప్రభుత్వం
- శిథిలావస్త లో పాఠశాలలు ప్రస్తుతం కొత్త బడులు కట్టించాం
- విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తీసుకొచ్చాం
- అందరికీ వైద్యం అందుబాటులో ఉంచాం
- రైతు బంధు ద్వారా 70 లక్షల మందికి 73,000 వేల కోట్లు ఇచ్చాం
- దేశం లో రైతును రాజు ను చేసింది తెలంగాణ కేసిఆర్ ప్రభుత్వం
- 24 గంటల కరెంట్ ఇచ్చేది దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే
- రైతు బందు సమితి, రైతు వేడుకలు నిర్మించి రైతులకు బెన్ ఫిట్ అందిస్తున్నాం
- రైతులకు 5లక్షల రైతు భీమా అందిస్తున్నాం
సండ్ర తరఫున బండి ప్రచారం
- ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ప్రచారం
- వేంసురు మండలం కల్లూరుగూడెం గ్రామంలో రోడ్‌షో
- ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పార్థసారథి రెడ్డి
కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు: మాజీ సీఎం
- తెలంగాణ ప్రచారంలో హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకుర్
- హిమాచల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు
- 10 గ్యారెంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు
- అక్కడి ఎన్నికల సమయంలో ప్రతీ మహిళకు నెలకు 15 వందల రూపాయలు ఇస్తామని చెప్పారు
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అయ్యింది
- హామీలు అమలు కావడం లేదు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు
- 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పారు.. ఇప్పటికీ అమలు చేయడం లేదు
- ఫ్రీ కరెంట్ మాట దేవుడేరుగు.. విద్యుత్ పై అదనపు చార్జీలు వడ్డిస్తున్నారు
బీఆర్‌ఎస్‌పై గడ్డం వివేక్ ఫైర్
- బీఆర్‌ఎస్‌పై చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ ఫైర్
- బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకుంది: వివేక్
- అందుకే నాపై ఈసీకి ఫిర్యాదు: వివేక్
- కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేస్తేనే నాపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి: వివేక్
- బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే: వివేక్
- బీజేపీలో ఉన్నంత కాలం ఏమీ కాలేదు: వివేక్
- కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిస్తే ఈడీ దాడులా?: వివేక్
- ఏదో చేసి నన్ను జైల్లో పెట్టాలని చూస్తున్నారు: వివేక్
విఠల్‌రెడ్డికి చేదు అనుభవం
- ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డికి చేదు అనుభవం
- అభివృద్ధి ఎక్కడ? అని అడ్డుకున్న గ్రామస్తులు
- నిర్మల్ జిల్లా తానూర్ మండల్ బోరిగాం గ్రామంలో ఘటన
- బీఆర్‌ఎస్ నేతలతో గ్రామస్తుల వాగ్వాదం.. ఘర్షణ వాతావరణం
- పోలీసులు సముదాయించడంతో శాంతించిన గ్రామస్తులు
కాళేశ్వరం పునర్నిర్మాణం చేసి తీరతాం: జీవన్‌రెడ్డి
- సాక్షి టీవీతో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతాం
- ఇందిరమ్మ పాలనను రాక్షస పాలనగా అభివర్ణిస్తున్న కేసీఆర్ చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలో కట్టిందే
- తన హయాంలో అభివృద్ధి గురించి మాట్లాడేవారికి పొలాస అగ్రికల్చర్ కళాశాల, జేఎన్టీయూ, న్యాక్ వంటివి కనిపించడం లేదా?
- నాకివే చివరి ఎన్నికలని నేనెప్పుడు అనలేదు
- ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు జీవన్‌రెడ్డి కౌంటర్
- ఎమ్మెల్సీగా ఇంకా రెండేళ్లు ఉందికదా.. మళ్ళీ ఎమ్మెల్యే బరిలో ఎందుకని ప్రశ్నిస్తున్నవారు.. ముందు రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుని మాట్లాడాలి
- దీర్ఘకాలిక లక్ష్యాలతో అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే తన లక్ష్యం, కాంగ్రెస్ లక్ష్యం
- ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్‌వే
25న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
- మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని ప్రసంగించనున్న రాహుల్
- నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో తొలుత బోధన్కు
- భోదన్ లో ప్రచార సభలో ప్రసంగించనున్న రాహుల్.
- అక్కడ నుంచి ఆదిలాబాద్‌కు.. బహిరంగ సభ ద్వారా ప్రచారం
- సాయంత్రం వేములవాడకు.. బహిరంగ సభలో ప్రసంగం
- సాయంత్రం హెలికాప్టర్ లో బేగంపేటకు.. అటు నుంచి ఢిల్లీకి
కొత్తగూడెంలో జనసేనాని ప్రచారం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్
- కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉదయం బహిరంగ సభ
- జనసేన తరఫున కొత్తగూడెంలో లక్కినేని సురేందర్ పోటీ
- బీజేపీ మద్దతు ప్రకటన
- ఇవాళ సురేందర్‌కు ఓటేయాలని కొత్తగూడెం వాసుల్ని అభ్యర్థించనున్న పవన్
- సూర్యాపేటలోనూ బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు కు మద్దతుగా పవన్ ప్రచారం
స్పీడ్ పెంచిన కాషాయ సేన
- నేడు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పర్యటన
- నిజామాబాద్ రూరల్, సంగారెడ్డి సభల్లో పాల్గొననున్న నడ్డా
- నేడు ఉదయం 10.30 నుంచి 12.30 వరకు అత్తాపూర్‌లో ఇంటలెక్చువల్స్ తో భేటీ కానున్న పీయూష్ గోయల్
- మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు బంజారాహిల్స్ హయత్‌ప్లేస్‌లో మేధావులతో సమావేశం కానున్న పీయూష్ గోయల్
- రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు హిమాయత్ నగర్ జైన్ భవన్‌లో జైనులతో భేటీ కానున్న పీయూష్ గోయల్
- ఖైరతాబాద్ వెంకటేశ్వర కాలనీలో ఉదయం 8 గంటలకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాదయాత్ర
- తెలంగాణలో నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటన
- సిరిసిల్లలో మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న స్మృతి ఇరానీ
- ఖైరతబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మహిళల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొననున్న స్మృతి ఇరానీ
నేడు మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పఠాన్ చెరులో కేసీఆర్ ఎన్నికల ప్రచారం
- నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేటీఆర్
- ఉదయం 11 గంటలకు హుజూర్‌నగర్
- మధ్యాహ్నం 1 గంటకు దేవరకొండల్లో అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో
నేడు ఆరు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- ఉదయం 11 గంటలకు దుబ్బాక బహిరంగ సభ
- మధ్యాహ్నం 12.30 గంటలకు హుజూరాబాద్ బహిరంగ సభ
- మధ్యాహ్నం 2 గంటలకు మానకొండూర్ బహిరంగ సభ
- మధ్యాహ్నం 3 గంటలకు మహేశ్వరం కార్నర్ మీటింగ్
- సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్ కార్నర్ మీటింగ్
- సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
777కు చేరిన ఎంసీసీ ఉల్లంఘన కేసులు
- ఎన్నికల ప్రవర్తన నియమావళి
- ఉల్లంఘనలపై ఈసీ కేసుల కొరడా
- రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి సహా పలువురిపై కేసులు
గట్టిపోటీ... అధిక సీట్లు...
- ఆ దిశగా కసరత్తు చేస్తున్న కమలం
- 25–30 సీట్లలో గట్టిపోటీతో పాటు అధిక సీట్లు గెలుపొందడంపై స్పెషల్ ఫోకస్
- అగ్రనేతల ప్రచారం ఉధృతం.. ముఖ్యనేతల పర్యటనలన్నీ తెలంగాణలోనే
- 25 నుంచి మూడురోజులు 6 సభలు,
- హైదరాబాద్‌లో రోడ్‌షోకు ప్రధాని మోదీ
- ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర బీజేపీదేనన్న అంచనాల్లో నేతలు
ఆ వంద లేఖలు బయటపెట్టాలి.. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్
- మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేయకపోగా సీఎం అబద్ధాలు ఆడుతున్నారని విమర్శ
- దళిత సీఎం హామీని ఇప్పుడైనా అమలుచేస్తారా?
- బీసీని సీఎం చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా?
- డిసెంబర్ 3 తర్వాత బీసీ నేత పేరును సీఎంగా తాము ప్రతిపాదిస్తామని వెల్లడి
మూడోసారీ మా ప్రభుత్వమే.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
- 70 నుంచి 82 సీట్లు ఖాయం..
- కాంగ్రెస్ హడావుడి పాలపొంగు వంటిదే..
- రేవంత్‌రెడ్డికి రెండు చోట్లా ఓటమి తప్పదు
- కాంగ్రెస్ సీనియర్లు చాలామంది ఓడిపోబోతున్నారు
- ప్రాజెక్టులపై దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నం
- క్షేత్రస్థాయిలో పరిస్థితి బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంది
- తెలంగాణకు ఏకైక గొంతు కేసీఆర్ మాత్రమే..
- కాపాడుకోవాలా, వద్దా అన్నది ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్య