కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: అంబటి | Tdp Temptations In The Corporation Standing Committee Elections | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: అంబటి

Jan 28 2025 9:33 PM | Updated on Jan 28 2025 9:33 PM

Tdp Temptations In The Corporation Standing Committee Elections

కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

సాక్షి, గుంటూరు: కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారారని.. కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు. ఎమ్మెల్యేలు సిగ్గు విడిచి కార్పొరేటర్లు ఇళ్లకి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్‌కి యాభై లక్షలు ఇస్తామంటున్నారు. కార్పొరేటర్లను కొంటున్న విధానాన్ని ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు.

ప్రజాస్వామ్యానికి టీడీపీ విఘాతం: అప్పిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని.. లక్షల రూపాయలు కార్పొరేటర్లకు వెదజల్లుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నారు.. మా కార్పొరేటర్లు నిజాయితీగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలి’’ అని అప్పిరెడ్డి హితవు పలికారు.

ప్రజాస్వామ్యానికి టీడీపీ తూట్లు: మనోహర్‌
మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ, ఆరు స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలుచుకునే బలం మాకుంది. కేంద్ర మంత్రి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కూటమి బలం కేవలం పదకొండు సభ్యులు మాత్రమే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement