స్వీపర్‌ పోస్టుకు కమిషన్‌ డిమాండ్‌.. మహిళపై టీడీపీ నేత వేధింపులు | TDP Leader neelam ramesh Allegedly Commission Demand for Sweeper Job in Machilipatnam | Sakshi
Sakshi News home page

స్వీపర్‌ పోస్టుకు కమిషన్‌ డిమాండ్‌.. మహిళపై టీడీపీ నేత వేధింపులు

Jun 23 2025 6:12 PM | Updated on Jun 23 2025 7:01 PM

TDP Leader neelam ramesh Allegedly Commission Demand for Sweeper Job in Machilipatnam

సాక్షి,కృష్ణాజిల్లా : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు మరింత బరితెగిస్తున్నారు. స్కూల్లో స్వీపర్ ఉద్యోగం ఇప్పించినందుకు కమిషన్‌ ఇవ్వాలంటూ మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ నీలం రమేష్ వేధింపులకు పాల్పడ్డాడు. అదేంటని ప్రశ్నించినందుకు దాడికి దిగాడు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరంలోని స్కూల్లో ఓ మహిళకు రమేష్‌ స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. స్వీపర్‌ ఉద్యోగం చేసినందుకు గాను సదరు మహిళకు వచ్చే జీతం రూ.6వేలు. అందులోనే తన కమిషన్‌ రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఖాతాలో ఆరు నెలల వేతనం జమైంది.

ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రమేష్‌ తన కమిషన్‌ ఇవ్వాలని మహిళను వేధించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలి భర్త బందరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై బాధితురాలి భర్తపై రమేష్‌ దాడికి దిగాడు. టీడీపీ నేత రమేష్ నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement