మంత్రి మహిళను కొట్టాడని వీడియో షేర్ చేసిన బీజేపీ.. 48 గంటలు డెడ్‌లైన్‌

Tamil Nadu Minister Kkssr Ramachandran Hits Woman BJP Demands His Resignation By Sharing Video - Sakshi

సాక్షి, చెన్నై:  తమిళనాడు మంత్రి కేకెఎస్ఎస్‌ఆర్ రామచంద్రన్ ఓ మహిళను కొట్టారని ఆరోపిస్తూ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసింది బీజేపీ. పేదలు, మహిళలు అంటే అధికార డీఎంకేకు గౌరవం లేదని ధ్వజమెత్తింది. ప్రజలు డీఎంకేకు ఏమైనా బానిసలా అని ప్రశ్నించింది. మహిళను కొట్టిన మంత్రి 48 గంటల్లోగా రాజీనామా చేయాలని, లేదంటే ఆయన ఇల్లును దిగ్బంధిస్తామని తమిళనాడు బీజేపీ చీఫ్‌ కే అన్నామలై హెచ్చరించారు.

అన్నామలై షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మరొకరితో మాట్లాడుతున్న ఆయన.. చేతిలో ఉన్న కాగితాలతో మహిళ తలపై కొట్టాడు. పలవనాథం గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. దీన్నే ఆధారంగా చూపిన బీజేపీ.. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించింది.

అయితే మంత్రి రామచంద్రన్‌ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఆ మహిళ తనకు బంధువు అవుతుందని పేర్కొన్నారు. ఆమెను కొట్టలేదని, కాగితాలు మాత్రమే తాకాయని చెప్పారు. పింఛను సమస్య కోసమే ఆ మహిళ తనను కలిసేందుకు వచ్చిందని వివరించారు. దీన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top