- పెట్టుబడుల సదస్సు..అంతా వట్టి తుస్సు
- పారిశ్రామిక దిగ్గజాల జాడ లేదు
- కానరాని జనసేసాని
- అంతా తండ్రీకొడుకుల హైప్
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు అంతా ఉత్త ఫార్స్ మారింది. బిర్లా టాటా అంబానీ వంటి పెద్ద పారిశ్రామిక సంస్థలు ఏవి పెట్టుబడుల సదస్సు రాకపోగా చోటామోటా సంస్థలు స్టార్టప్ కంపెనీలు కొన్ని మాత్రమే కనిపించాయి. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థలనే మళ్లీ పిలిచి మళ్లీ భూములు కేటాయించి మళ్లీ ఫోటోలు దిగడం మినహా రాష్ట్రానికి గొప్పగా లాభం జరిగింది ఏమీ లేదని పారిశ్రామిక విశ్లేషకులు అంటున్నారు.
గతంలో వైయస్ జగన్ ఇదే సదస్సు నిర్వహించగా దానికి ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. నేడు అలాంటి పెద్ద తలకాయలు ఏవీ రాకపోవడం గమనార్హం. చోటామోటా సంస్థలతో ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకుని లక్షలకోట్ల పరిశ్రమలు.. లక్షల్లో యువతకు ఉద్యోగాలు అంటూ మభ్యపెట్టడం మినహా వాటిల్లో గ్రౌండ్ అయ్యేవి చాలా తక్కువ అంటున్నారు.
జనసేనాని ఎక్కడ
రాష్ట్రంలో జరుగుతున్న ప్రముఖమైన ఈవెంట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోవడం వింత అనిపించింది. తెలుగుదేశానికి ప్రభుత్వానికి ఎప్పుడు ఏ అడ్డంకి ఆపద వచ్చిన అడ్డుగా నిలబడి ఆ డ్యామేజ్ అంతా మోసే పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమానికి హాజరు కాకపోవడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అని జనసైనికులు సందేహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి జన సేన తరఫున జనసేన విప్ పిడుగు హరిప్రసాద్.. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ మాత్రమే పాల్గొన్నారు. ఇతరత్రా ఇంకెవరు అక్కడ కనిపించకపోవడం విచిత్రంగా అనిపించింది. ఎంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి కి ఆహ్వానం ఉండాలి. లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో ఆ ప్రభుత్వం ఏర్పాటుకు కారకుడైన పవన్ కళ్యాణ్ ఇలాంటి వేదికల మీద కనిపించకపోవడం వెనుక ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా అన్న సందేహాలు కూడా వెలువెత్తుతున్నాయి.
తండ్రీకొడుకులకు ఎలివేషన్లు
పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం ఒక ఎత్తు అయితే రెండు రోజులు ఈవెంట్ ఆద్యంతం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ల కోసం ఇస్తున్న ఎలివేషన్ ఇంకో ఎత్తు. అసలు వచ్చే కంపెనీలు ఎన్ని అవి తెచ్చే పెట్టుబడులు ఎంత యువతకు లభించే ఉద్యోగాలు ఇవన్నీ అనే లెక్కలు పక్కన పెడితే లోకేష్ పవన్ కళ్యాణ్ లు అంతర్జాతీయ స్థాయి మేధావులు మాదిరిగాను ఆఖరికి లోకేష్ తను వేసుకున్న జాకెట్ తో ఫోటోను కూడా ఫేస్బుక్లో పెట్టి అది ఎక్కడ కొన్నది ...ఎక్కడ కుట్టించింది చెప్పండి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. పేరు ఊరు లేని కంపెనీలు వాటి యజమానులతో ఫోటోలు దిగడం ఆ కంపెనీ వేలాది కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటనలు.. వాస్తవ సమాచారాన్ని ప్రజలకు విడుదల చేసి అదేదో అద్భుతం జరిగిపోతుందన్నట్లుగా ప్రజలను నమ్మిస్తూ వచ్చారు.
ఈ రెండు రోజుల కార్యక్రమం ఆద్యంతం లోకేష్ ను హీరోగా నిలబెట్టడానికి ఏర్పాటు చేసింది తప్ప రాష్ట్రానికి ఏమాత్రం పనికివచ్చేదిగా లేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు అంతర్జాతీయ మేధావి అన్నట్లుగా అనుకూల మీడియా దానికి తోడు సోషల్ మీడియా మరికొన్ని పెయిడ్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్లు కూడా ఎక్కడ లేని హైప్ ఇస్తూ ఆయన్ను చాణక్యుడు అని ఎలివేషన్లు ఇస్తున్నాయి.
మున్ముందు లోకేష్ ను పార్టీకి ప్రభుత్వానికి సైతం పెద్దదిక్కుగా నిలబెట్టడానికి ఈ వేదికను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది రాష్ట్రానికి ఏమాత్రం కాదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం కేవలం చంద్రబాబు లోకేష్ ల వ్యక్తిగత కార్యక్రమం లేదా కుటుంబ ఫంక్షన్ మాదిరిగా నిర్వహించుకొని వాళ్లకు వాళ్లే జబ్బలు చేర్చుకున్నారని జనసేన నేతలు కూడా లోలోన కామెంట్లు చేసుకుంటున్నారు. ఇక ఈ సదస్సుకు పవన్ కళ్యాణ్ ను ప్రోటోకాల్ కోసం అయినా పిలిచారా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
-సిమ్మాదిరప్పన్న


