కారు దిగి కమలం కండువా కప్పుకుంటారా..!

Senior Leader Mandava Venkateswarlu Unhappy With TRS - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : తెలుగు రాజకీయాల్లో  పరిచయమక్కర్లేని పేరు మండవ వెంకటేశ్వరరావు. వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న లీడర్. కీలక పదవులు అనుభవించిన అనుభవం. టీడీపీలో ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుతో కలిసి చక్రం తిప్పిన నేత.. ఇదంత బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నకల ముందు ఎవరు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి కండువా వేసి వచ్చారు. ఇక అప్పటి నుండి మండవకు పెద్ద పదవే ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కాని ఇప్పటి వరకు ఏమీ లేక పోవడంతో ఆయన డైలామాలో పడ్డారు.. అసలు మండవ ప్యూచర్ ఏంటీ..?

సైకిల్ దిగి కారేక్కశారు..
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు‌కు కుడిభుజంగా పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోను పెద్ద నాయకునిగా గుర్తింపు పోందారు. తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పయినప్పటి నుంచి సైలెంట్ అయిన మండవ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు పాత స్నేహంతో సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి అహ్వనించారు. కేసీఆర్‌కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేక పోయారు. దీంతో సైకిల్ దిగి కారేక్కశారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సురేష్ రెడ్డి, ఇటు మండవ ఇద్దరు కారేక్కడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు అందరూ కానీ ఎంపీగా కవిత ఓడిపోయారు.

ఇక అప్పటి నుండి ఇద్దరి రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది. కానీ అనుహ్యంగా సురేష్ రెడ్డికి  రాజ్యసభ సీటిచ్చేశారు. మండవకు మాత్రం ఎలాంటి హమీ మాత్రం దక్కకపోగా ఒక్కసారిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడసలు మండవకు పదవి వస్తుందా లేదా గులాబీ బాస్ ఎలా అకామిడేట్ చేయనున్నారు అనే ప్రశ్న అతనితో పాటు అతని అనుచరులును కూడా వేదిస్తోంది.  ఈ నేపథ్యంలోనే ఎవరిని అడగాలో ఎం చేయాలో తెలియని పరిస్థిలో ఉన్నారట. పార్టీ మారాలనే ఒత్తిడి కూడా అనుచరుల నుండి పెరుగుతుందట. సంవత్సరం గడిచినా ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట మండవ. ఇప్పటికే ఓ పదవిని మండవకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

పార్టీకి దూరంగా..
గతంతో ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్)కి ఇచ్చిన ప్రభుత్వ సలహదారు పదవిని మండవకు ఇద్దామనే ఆలోచనలో సీఎం ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పదవి తీసుకోవాల వద్దా అనే డైలామా మండవను వేంటాడుతుందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి దీనికి బలం చేకూర్చుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా మండవ పార్టీ కార్యక్రమంలో అసలు పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కారు దిగి కమలం కండువ కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అటు నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్‌ తన పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి మండవకు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారో.. మండవకి రాజ్యసభ ఎప్పుడొస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top