breaking news
Mandava Venkateswarlu
-
కారు దిగి కమలం కండువా కప్పుకుంటారా..!
సాక్షి, నిజామాబాద్ : తెలుగు రాజకీయాల్లో పరిచయమక్కర్లేని పేరు మండవ వెంకటేశ్వరరావు. వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న లీడర్. కీలక పదవులు అనుభవించిన అనుభవం. టీడీపీలో ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుతో కలిసి చక్రం తిప్పిన నేత.. ఇదంత బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నకల ముందు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి కండువా వేసి వచ్చారు. ఇక అప్పటి నుండి మండవకు పెద్ద పదవే ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కాని ఇప్పటి వరకు ఏమీ లేక పోవడంతో ఆయన డైలామాలో పడ్డారు.. అసలు మండవ ప్యూచర్ ఏంటీ..? సైకిల్ దిగి కారేక్కశారు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోను పెద్ద నాయకునిగా గుర్తింపు పోందారు. తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పయినప్పటి నుంచి సైలెంట్ అయిన మండవ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు పాత స్నేహంతో సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి అహ్వనించారు. కేసీఆర్‌కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేక పోయారు. దీంతో సైకిల్ దిగి కారేక్కశారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సురేష్ రెడ్డి, ఇటు మండవ ఇద్దరు కారేక్కడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు అందరూ కానీ ఎంపీగా కవిత ఓడిపోయారు. ఇక అప్పటి నుండి ఇద్దరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. కానీ అనుహ్యంగా సురేష్ రెడ్డికి రాజ్యసభ సీటిచ్చేశారు. మండవకు మాత్రం ఎలాంటి హమీ మాత్రం దక్కకపోగా ఒక్కసారిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడసలు మండవకు పదవి వస్తుందా లేదా గులాబీ బాస్ ఎలా అకామిడేట్ చేయనున్నారు అనే ప్రశ్న అతనితో పాటు అతని అనుచరులును కూడా వేదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని అడగాలో ఎం చేయాలో తెలియని పరిస్థిలో ఉన్నారట. పార్టీ మారాలనే ఒత్తిడి కూడా అనుచరుల నుండి పెరుగుతుందట. సంవత్సరం గడిచినా ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట మండవ. ఇప్పటికే ఓ పదవిని మండవకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీకి దూరంగా.. గతంతో ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కి ఇచ్చిన ప్రభుత్వ సలహదారు పదవిని మండవకు ఇద్దామనే ఆలోచనలో సీఎం ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పదవి తీసుకోవాల వద్దా అనే డైలామా మండవను వేంటాడుతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి దీనికి బలం చేకూర్చుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా మండవ పార్టీ కార్యక్రమంలో అసలు పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కారు దిగి కమలం కండువ కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అటు నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ తన పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి మండవకు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారో.. మండవకి రాజ్యసభ ఎప్పుడొస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. -
టీడీపీ వర్సెస్ ఎమ్మార్పీఎస్
* టీడీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ * ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు * పోలీసుల రంగ ప్రవేశం.. స్వల్ప లాఠీచార్జి * ధ్వంసమైన ‘మండవ ’ వాహనం ఆరుగురి అరెస్టు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు కొందరు ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రయత్నించడం, ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడం, కార్యకర్తలపై దాడికి దిగడంతో సదస్సులో రభస జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించగా, వారిపైనా కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయగా, ఆగ్రహం చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారును ధ్వంసం చేశారు. ఈ కేసులో పోలీసులు ఆరు గుర్ని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రసంగం కొనసాగుతుండగా ఒక్కసారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు దూసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ వేదికపై ఉన్న టేబుళ్లను తీసి విసిరేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై దాడికి దిగారు. ఎస్సైలు మధు, సైదయ్య వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ఎస్సైలకు సైతం దెబ్బలు తగిలాయి. టీడీపీ కార్యకర్తలు కుర్చీలను విసిరేశారు. కేసీఆర్ టార్గెట్‌గా నేతల ప్రసంగాలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ టార్గెట్‌గా టీడీపీ సమావేశంలో ఆ పార్టీ నాయకులు నిప్పులు కురిపించారు. టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచీ ముగిం చేంత వరకూ కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. ‘అడుక్కోవడానికి వచ్చిన నీకు మా పార్టీ కార్యకర్తలు భిక్షంగా ఓట్లు వేసి గెలిపించారు. కానీ, గెల్చిన తరువాత ప్రజలు భిక్షమెత్తుకునే విధంగా చేస్తున్నావు... నువ్వు రావణాసురుడివైతే మా కార్యకర్తలు రాముళ్లై బాణాలను సంధిస్తారు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యికి పైగా అమరులైతే, 459 మందే ఉన్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు.. సకల జనుల సర్వేలో కోళ్లు, మేకలు, పశువులు ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించిన నువ్వు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణ, అవయవాల త్యాగం చేసినవారు మీ ఇంట్లో ఉన్నారా? అని సర్వేలో అడిగించావా’’ అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో బండారం బయటపెడ తాననే ఉద్దేశంతో తనను మాట్లాడనివ్వకుండా కుట్ర చేశారన్నారు. కాని ప్రజల ముందు నిజాలు బయటపెట్టి టీఆర్ఎస్ పార్టీ పీక నొక్కడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కన అమర వీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని 20 సార్లు సీఎంకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బహుశా ఆయన పోయాక తన విగ్రహం పెట్టించుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. బుద్ధుడి పక్కన రూ. వెయ్యి కోట్లతో స్తూపం పెట్టే వరకు ఊరుకోబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా అమర వీరుల త్యాగానికి గుర్తుగా ప్రత్యేక రోజును కేటాయించి హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వర్రావు, అరికెల నర్సారెడ్డి తదితరులు కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. అనంతరం, జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 44 మంది రైతు కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు.