చిల్లర రాజకీయాలు మానుకో చంద్రబాబూ..: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదని, పవన్‌ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారని ఎద్దేవా చేశారు.

2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదు. ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతున్నారు. పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు. ఒకచోట టికెట్ ఇవ్వలేకపోతే మరోచోట కేటాయిస్తాం. అధినేత మాట కాదని ఎవరూ ఉండరు. చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి’’ అని సజ్జల చెప్పారు.

టీడీపీ అనే శిథిలపార్టీని చంద్రబాబు ఏలుకుంటున్నారు. ఎల్లో మీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది. వారు పగటి కలలు కంటున్నారు. అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం. వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం. జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అసలు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి’’ అని సజ్జల పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ సరే.. మీ సంగతేంటి చంద్రబాబు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top