బీఆర్‌ఎస్‌ను కాపాడుతోంది బీజేపీనే | Revanth Reddy Comments on BRS and BJP | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను కాపాడుతోంది బీజేపీనే

Oct 27 2023 4:38 AM | Updated on Oct 27 2023 4:38 AM

Revanth Reddy Comments on BRS and BJP - Sakshi

మాట్లాడుతున్న రేవంత్‌. చిత్రంలో ఉత్తమ్,భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను కాపాడుతు  న్నది బీజేపీనే అని, మేడిగడ్డపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదికను కేంద్ర ప్రభుత్వం బయట పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి బీఆర్‌ఎస్‌ ‘ప్రొటెక్షన్‌ మనీ’ చెల్లి స్తోంది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. గాల్లో మేడ లా మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను నిర్మించారన్నారని ధ్వజమె త్తారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీనియర్‌ నేత బలరాం నాయక్‌తో కలసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈడీ, ఐటీ, సీబీ ఐ అధికారులు దాడులు చేస్తారని..తెలంగాణలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టే దాడులు జరగట్లేదని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు బీజేపీకి ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల ని విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లిస్‌ మూడు పార్టీలు చెడ్డీగ్యాంగ్‌ అని, అందుకే  ప్రభు త్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ, మజ్లిస్‌లు ప్రయత్నిస్తున్నాయని... వీరి మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయని ఆరోపించారు.

రాజగోపా ల్‌రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్‌రెడ్డిలు సిద్ధాంతాలు నమ్మి బీజేపీలో చేరలేదని.. కేసీఆర్‌ చేసిన అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందని చేరారని రేవంత్‌ పేర్కొన్నారు. కానీ కేసీఆర్‌పై ఏవిధమైన చర్యలూ బీజేపీ తీసుకోదనే వాస్తవాన్ని వారంతా ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టే అక్కడ ఉండేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్, కేటీఆర్‌లను ఓడిస్తాం
కేసీఆర్, కేటీఆర్‌లను చిత్తుగా ఓడించేందుకు తాను, భట్టి విక్రమార్క సిద్ధంగా ఉన్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో పోటీకి కేసీఆర్‌ ను ఆహ్వానించానని, ఆయన రాకపోతే తానే కామారెడ్డిలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అదే విధంగా అధిష్టానం ఆదేశిస్తే తాను, భట్టి విక్రమార్క ఇద్దరూ కేసీఆర్, కేటీఆర్‌లపై పోటీ చేసి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

బీజేపీ, జనసేన పొత్తులపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. పనిలో పనిగా బీజేపీ జనసేనతో పాటు కేఏ పాల్‌ను కూడా కలుపు కుంటే బాగుండేందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తామేమీ ప్రభుత్వ పథకాలను వద్దన లేదనీ, రాష్ట్ర ప్రజలకు అందే సంక్షేమ పథకాలు నవంబర్‌ 2వ తేదీలోపు పూర్తి చేయాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement