Rahul Gandhi: రాహుల్ జీ.. తమిళ అమ్మాయిని చూసిపెడతాం.. పెళ్లి చేసుకోండి..

చెన్నై: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. మూడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు కన్యాకుమారిలోని మార్తాండం చేరుకున్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మహిళా కార్యకర్తలు ఆయనతో ముచ్చటించారు. ఈ సమయంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అందుకే ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓ తమిళ అమ్మాయిని చూసిపెడతాం అని అంది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో ఇది వినోదాత్మకమైన క్షణం అన్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే రాహుల్ గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడండి అని ఓ ఫోటో కూడా షేర్ చేశారు.
A hilarious moment from day 3 of #BharatJodoYatra
During @RahulGandhi’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా ఇతర సమస్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను బుధవారం కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు 3వేలకు పైగా కీలోమీటర్లు సాగనుంది. కశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది.
చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు!