రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్‌

Rahul Gandhi and Priyanka Gandhi have no political experience - Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు రాజకీయ అనుభవం లేదని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఆయన పలు వార్తా సంస్థలకు ఇచి్చన ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ, ప్రియాంక నా పిల్లల్లాంటి వాళ్లు. నన్ను అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించారు. ఎమ్మెల్యేలను నేను విమానాల్లో గోవాకు తీసుకెళ్లలేదు. అది నా విధానం కాదు.

అనుభవం లేని రాహుల్, ప్రియాంకలను వారి సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని విమర్శించారు. పంజాబ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై బలమైన అభ్యరి్థని పోటీకి దించుతానని చెప్పారు. సిద్ధూ జాతి వ్యతిరేక శక్తి, ప్రమాదకరమైన వ్యక్తి అని అమరీందర్‌ ఆరోపించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యరి్థత్వం సిద్ధూకు దక్కకుండా చేయడమే తన ధ్యేయమని, అందుకోసం పోరాటం సాగిస్తానన్నారు.

సిద్ధూ లాంటి ప్రమాదరకమైన వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడడానికి ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను ఓడిస్తానని ప్రతినబూనారు. పంజాబ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన తర్వాత మరొకరిని ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాం«దీని కోరానని, అయినా ఆమె పట్టించుకోలేదని అన్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తనకు వయసు అనేది ఒక అడ్డంకి కాదని 79 ఏళ్ల అమరీందర్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top