Presidential Elections 2022: మద్ధతు ఇవ్వాలంటూ అధికార పక్షానికి సిన్హా.. విపక్షాలకు ద్రౌపది ఫోన్లు

President Election 2022: Yashwant Sinha Draupadi Murmu Calls Up - Sakshi

న్యూఢిల్లీ: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి  యశ్వంత్‌ సిన్హా (84) శుక్రవారం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు ఫోన్‌ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు  మద్దతివ్వాలని కోరారు. బీజేపీ కురువృద్ధ నేత, గురువు అయిన ఎల్‌కే అద్వానీతో సైతం ఆయన ఫోన్‌ చేసి చాలాసేపే మాట్లాడినట్లు తెలుస్తోంది. నామినేషన్‌ వేయకముందే ఆయన ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. 

ఇక రాష్ట్రపతి అభ్యర్థి కావడంతో.. సిన్హాకు జెడ్‌ కేటగిరీ భద్రత అందించింది కేంద్రం. సీఆర్పీఎఫ్‌ సాయుధ కమాండోలను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే..  27న(సోమవారం) ఆయన నామినేషన్‌ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోనియా, పవార్, మమతకు ముర్ము ఫోన్‌ 
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం కీలక ప్రతిపక్ష నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. నామినేషన్‌ వేసిన అనంతరం..  కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలకు ఫోన్‌ చేసి, తనకు మద్దతు తెలపాలని కోరారు. త్వరలోనే వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని వారికి ముర్ము చెప్పినట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నేతలు ఆమె విజయాన్ని కాంక్షించారని తెలిపాయి. బీజేపీ చీఫ్‌ నడ్డా శుక్రవారం కాంగ్రెస్‌ నేతలు మలికార్జున ఖర్గే, ఆధిర్‌ రంజన్‌ చౌధురి, మాజీ పీఎం, జేడీయూ నేత దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాలకు ఫోన్‌ చేసి, ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.

చదవండి: అట్టహాసంగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top