పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు: పొన్నవోలు | Ponnavolu Sudhakar Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు: పొన్నవోలు

Apr 15 2026 9:05 PM | Updated on Apr 15 2026 9:09 PM

Ponnavolu Sudhakar Reddy Fires On Chandrababu Govt

సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్ట్ పెడితే, పూడి శ్రీహరి, గిరీష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. యూనిఫాం లేకుండా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు. సెక్షన్‌ 24,25 కింద న్యాయ పోరాటం చేస్తాం’’ అని పొన్నవోలు తెలిపారు.

‘‘తప్పు అని ఎత్తి చూపిస్తే.. అరెస్ట్ చేస్తున్నారు. గిరీష్‌రెడ్డికి సెల్ఫ్ బాండ్‌పై బెయిల్ మంజూరు చేశారు. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు. హైకోర్టు పదే పదే చెప్పినా కూడా 111 సెక్షన్‌లు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు దాని కింద పనిచేస్తున్నారు’’ అంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement