తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు నిల్‌! | Not a Single Muslim and Brahmin Got Ticket | Sakshi
Sakshi News home page

Rajasthan: తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు నిల్‌!

Published Thu, Mar 28 2024 12:03 PM | Last Updated on Thu, Mar 28 2024 12:03 PM

Not a Single Muslim and Brahmin Got Ticket - Sakshi

రాజస్థాన్‌లో లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో  ఎక్కడా కూడా బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. అయితే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్లు కేటాయించామని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

పార్టీ గతంలో చాలాసార్లు బ్రాహ్మణ కార్డును ప్లే చేసింది. ఇప్పడు పార్టీ తన వైఖరిని మార్చుకోవడం పలువురు నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాజస్థాన్‌ చరిత్రలో  ముస్లిం, బ్రాహ్మణ అభ్యర్థికి కూడా కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు బ్రాహ్మణుల ఓట్లు అక్కర్లేదని తెలుస్తోంది. జైపూర్‌ నుంచి బ్రాహ్మణ నేతకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చి ఆ తర్వాత  రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వరుణ్‌ పురోహిత్‌ మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్‌ గౌరవం ఇవ్వనప్పుడు ఓటమిని చవిచూసిందన్నారు.  అయితే రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వార్‌రూమ్‌ అధ్యక్షుడు జస్వంత్‌ సింగ్‌ గుర్జార్‌  మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సర్వే, ఫీడ్‌బ్యాక్‌, డిమాండ్‌ మేరకు టిక్కెట్లు ఇచ్చామన్నారు.  కులం, సంఘం లేదా తరగతి ఆధారంగా టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement