గుర్తుంచుకో బాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు: తోట త్రిమూర్తులు | Mlc Thota Trimurthulu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

గుర్తుంచుకో బాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు: తోట త్రిమూర్తులు

Sep 21 2024 5:13 PM | Updated on Sep 21 2024 5:32 PM

Mlc Thota Trimurthulu Fires On Chandrababu

దేశమంతా డా.బిర్.అంబేద్కర్ రచించిన రాజ్యంగం నడుస్తుంటే.. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు.

సాక్షి, కాకినాడ జిల్లా: దేశమంతా డా.బిర్.అంబేద్కర్ రచించిన రాజ్యంగం నడుస్తుంటే.. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. కాజులూరు మండలం పల్లిపాలెంలో తమ బంధువుల చెరువులను ధ్వంసం చేయించారు. 34 ఎకరాల్లో 11 ఎకరాలు సీలింగ్‌లో ఉందని ధ్వంసం చేశారు. అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి ధ్వంసానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

‘‘భూముల వ్యవహారం కోర్టులో ఉన్నా అధికారులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్‌సీపీ వ్యక్తిని కాబట్టే నాపై కక్ష కట్టారు. ప్రభుత్వాలు, అధికారం ఎల్లకాలం ఉండదు. ఇది సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌కు చెబుతున్నా.. చట్టపరంగా ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు’’ అని తోట త్రిమూర్తులు అన్నారు.

ఇదీ చదవండి: డైవర్షన్‌ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement