ఎమ్మెల్సీ జకియా ఖానం టీడీపీలో ఉన్నారు: బొత్స సత్యనారాయణ | MLC Botsa Satyanarayana Key Comments On Zakia Khanam Over TTD VIP Tickets Issue | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ జకియా ఖానం టీడీపీలో ఉన్నారు: బొత్స సత్యనారాయణ

Oct 20 2024 12:05 PM | Updated on Oct 20 2024 1:29 PM

MLC Botsa Satyanarayana Key Comments On Zakia Khanam

సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ జకియా ఖానంకు వైఎస్సార్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు శాసనమండలిలో ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత ఆమె టీడీపీలోకి వెళ్లినట్టు చెప్పారు.

శాసనమండలిలో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో లేరు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. పలు సందర్భాలలో మంత్రి లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. తిరుమలలో వీఐపీ టిక్కెట్లు ఆమె అమ్ముకున్నట్టు వచ్చిన ఆరోపణలతో మాకు సంబంధం లేదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

కాగా, జాకియా ఖానం తిరుపతిలో వీఐపీ టికెట్లు విక్రయిస్తున్నారు. ఆరు టికెట్లను రూ.65వేలకు అమ్మారు. ఈ నేపథ్యంలో భక్తులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎమ్మెల్సీ సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రశేఖర్‌, ఏ2గా జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్‌వో కృష్ణతేజ పేర్లను చేర్చారు. అయితే, ఏపీలో కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే ఆమె టీడీపీలో చేరారు. మంత్రులు లోకేష్‌, ఫరూఖ్‌ను కలిసి తన మద్దతు ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement