ఎవరు చర్చకు వచ్చినా రెడీ.. ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి ఓపెన్‌ సవాల్‌ | MLA Mahesh Reddy Challenged TDP On Development Of Gurazala | Sakshi
Sakshi News home page

ఎవరు చర్చకు వచ్చినా రెడీ.. ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి ఓపెన్‌ సవాల్‌

Nov 13 2022 10:28 AM | Updated on Nov 13 2022 10:49 AM

MLA Mahesh Reddy Challenged TDP On Development Of Gurazala - Sakshi

సాక్షి, పిడుగురాళ్ల: గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్దమంటూ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఓపెన్‌ సవాల్‌ విసిరారు. కాగా, మహేష్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2019-2022 మధ్య కాలంలో గురజాల అభివృద్ధి కోసం రూ.2,673 కోట్లు ఖర్చు చేశాము.

టీడీపీతోపాటు ఏపార్టీ వచ్చినా చర్చకు రెడీ. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గత 40 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పల్నాడులోని గురజాల వెనుకబడ్డ ప్రాంతం. వైఎస్సార్‌ హయంలోనే ఇక్కడ అభివృద్ధి మొదలైంది. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచాము. ఫ్లోరైడ్‌ సమస్యను రూపుమాపేందుకు చర్యలు చేపట్టాము. టీడీపీ హయంలో ఒక్క పథకమైనా చేపట్టారా?’ అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement