‘టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారింది’ | MLA Jogi Ramesh Slams On Chandrababu And TDP At Tadepalli | Sakshi
Sakshi News home page

‘టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారింది’

Aug 21 2021 5:21 PM | Updated on Aug 21 2021 6:37 PM

MLA Jogi Ramesh Slams On Chandrababu And TDP At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని, తాలిబన్‌ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ.. కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబాట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా చేస్తున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను చూసి టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని ధ్వజమెత్తారు. తాను అంబేద్కర్ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారని, తనపై విచ్ఛిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

చదవండి: మీవాడు సీఎం కాకపోతే.. ఇంత ఫ్రస్ట్రేషనా!

దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబుపై కేసు పెట్టాలా? లేదా ఉరితీయాలా? అని జోగి రమేష్‌ నిలదీశారు. అదీకాక చంద్రబాబు విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా, అగ్నికుల క్షత్రియులను తరిమికొడతానని అన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిసి కుటుంబంలా ఉన్నారని, అది తట్టుకులేక బాబు కులాల్లో చిచ్ఛులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్‌ రిజర్వేడ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లల్లో అధిక శాతం బలహీన వర్గాలకు కేటాయించారని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement