బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Minister Komati Reddy Venkat Reddy Hot Comments On KCR | Sakshi
Sakshi News home page

బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jun 15 2024 5:27 PM | Updated on Jun 15 2024 6:10 PM

Minister Komati Reddy Venkat Reddy Hot Comments On KCR

బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో మంత్రి కొమటిరెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలిపేందుకు కేటీఆర్‌, సంతోష్‌ రావులు ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. 

యాదాద్రి, చత్తీస్‌గఢ్ కరెంట్ విషయంలో అవకతవకలు జరిగాయి. విద్యుత్ అంశంలో 15 వేల కోట్ల అవినీతి జరిగింది. నిజాయితీ గల వ్యక్తితో కమిషన్ వేస్తే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కమిషన్‌పై నమ్మకం లేదని కేసీఆర్ అనడం దుర్మార్గమని అన్నారు.  

మీరు ఎన్ని అవకతవకలు చేసినా వదిలేయాలా? అని ప్రశ్నించిన కోమటి రెడ్డి.. గొర్రెల‌ పంపిణీలో జరిగిన ఏడు వందల కోట్లు అవినీతిపై ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును అమెరికాలో హరీష్ రావు కలిశారు. ఇండియాకు రావద్దని ఆయనకు హరీష్‌ రావు చెప్పారని తెలిపారు. 

కేసీఆర్ పదేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో దోచుకున్న ఆస్తిని పంచాడు. కేసీఆర్ గురించి మాట్లాడితే నోరు పాడవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement