Harish Rao: ఈటల రాజేందర్‌ను చిత్తు చిత్తుగా ఓడించండి: హరీశ్‌

Minister Harish Rao Slams BJP Leader Etela Rajender  - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్ మండలం కన్నుక గిద్దే, జోపాకలో మంత్రి హరీశ్‌ రావ్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావ్ మాట్లాడుతూ.. 'కారులో ఎక్కించే టీఆర్ఎస్‌కి ఓటు వేద్దామా..? కారుతో తొక్కించే బీజేపీకి ఓటు వేద్దామా..? ధరలు పెంచే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా..? పేదలను కడుపులో పెట్టుకుని చూసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా..?. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి లేక బీజేపీ- కాంగ్రెస్ ఏకమైంది.

ఎవరో ఏడ్చారని, తిట్టారని, సెంటిమెంట్ మాటలకు పడిపోవద్దు. రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మేం ముంగిటకు ఏం చేస్తామో చెప్తాం. బీజేపీ కూడా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి. ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారు. హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజి కావాలని, జిల్లా కావాలని రాజీనామా చేశారా?. గెల్లు గెలిస్తే హూజూరాబాద్ ప్రజలకు లాభం. ఈటల గెలిస్తే బీజేపీకి లాభం. దేశంలో 18 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌లో ఎక్కడైనా రూ. 2వేలు ఇస్తున్నారా?. కేవలం రూ. 600 పెన్షన్ ఇస్తున్నారు. పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నరు కేసీఆర్. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా పేదింటి ఆడపిల్లకు ఒక్క రూపాయి సాయం చేస్తున్నారా. కళ్యాణ లక్ష్మి కడుపు నింపదు అంటున్నడు రాజేందర్, మీరు చెప్పండి కళ్యాణ లక్ష్మి వద్దా..? కావాలనుకునే వాళ్లు రాజేందర్‌ను చిత్తు చిత్తుగా ఓడించండి. 

చదవండి: (ఎన్ని కుట్రలు చేసినా భయపడను: ఈటల) 

మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక్క ఇళ్లు కట్టలేదు. గెల్లు శ్రీనును గెలిపిస్తే మీ జాగాలో మీకే ఇళ్లు కట్టించే కార్యక్రమం చేయిస్తా. 30 తేదీ వరకే ఓట్లు. సీఎంగా కేసీఆర్ ఉంటారు. నేను ఆర్థిక మంత్రిగా ఉంటా. చేసేది మేమే. పని చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. మేం మాట తప్పితే మీరు ఊరుకుంటారా?. మంత్రిగా పనిచేయని రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేస్తారా?. కేంద్రం 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచింది. గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచారు. బీజేపీకి ఓటు వేయడమంటే వేయి రూపాయల సిలిండర్ ధర పెంచడాన్ని ఓప్పుకోవడమే కదా అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top