దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున | Sakshi
Sakshi News home page

దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున

Published Tue, Jun 27 2023 2:27 PM

Merugu Nagarjuna Slams Chandrababu And Eenadu For Fake News - Sakshi

సాక్షి, తాడేపల్లి: సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు దళితులను ఏ రోజైనా పట్టించుకున్నారా అని మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబుకి దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా అని నిలదీశారు. బాబు దళిత ద్రోహి అని, ఆయన హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. దళితులపై దాడులు చేసిన వారిపై తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

‘రామోజీ కళ్లు ఉన్న కబోది. నిజాలు రాయడం రామోజీకి చేతకాదు. పథకం ప్రకారం తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వంపై రామోజీ విషం కక్కుతున్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు రామోజీ తన పత్రికలో ఎందుకు రాయలేదు.’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ‘దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకున్నది మా ప్రభుత్వమే’

Advertisement
 
Advertisement