
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కూడా..
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవా రం మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె మహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పురాణం సతీశ్ కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎంను కలిసిన సతీశ్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
హైదరాబాద్‌లో కృతజ్ఞత సభ
కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకుగాను రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల నేతృత్వంలో 60 కమ్మ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కమ్మవారి సేవాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం హైదరాబాద్‌లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని కమ్మ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఒక స్థానాన్ని తమ సామాజికవర్గానికి కేటాయించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో సమాఖ్య ప్రధానకార్యదర్శి గంగవరపు శ్రీరామకృష్ణప్రసాద్, నేతలు కండపనేని రత్నాకర్, బొడ్డు రవిశంకర్ తదితరులున్నారు.
సీఎంను కలిసిన మత్స్య సొసైటీల చైర్మన్
ఇటీవల రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సొసైటీల సమా ఖ్య చైర్మన్‌గా నియామకమైన మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్‌ను కలిశారు. తనకు చిన్న వయసు లోనే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశమి చ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.