కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపడతాం: మధుయాష్కీ

Madhu Yashki Political Counter Attack To KCR - Sakshi

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చాడు. త్వరలోనే కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. 

కాగా, మధు యాష్కీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్‌ఎస్‌ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారు. కానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నేను పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు. అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను’ అని స్పష్టం చేశారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top