రూ.18 వేల కోట్ల కుంభకోణం.. విచారణ జరపాలి: మధుయాష్కీ | Madhu Yashki Goud Comments On TRS And BJP Leaders | Sakshi
Sakshi News home page

రూ.18 వేల కోట్ల కుంభకోణం.. విచారణ జరపాలి: మధుయాష్కీ

Dec 22 2021 3:46 PM | Updated on Dec 22 2021 3:49 PM

Madhu Yashki Goud Comments On TRS And BJP Leaders - Sakshi

కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు.

సాక్షి, ఢిల్లీ: కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు లేక.. అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు.

చదవండి: 'తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రిని అడుక్కోవడానికి రాలేదు'

రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1940తో కొనుగోలు చేసింది. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి  మూడు, నాలుగు వందల రూపాయల తక్కువ ధరకు తీసుకుందని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రూ.18 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ  నాయకులు తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని రూ.18వేల కోట్లను మెక్కినట్లుగా తెలుస్తోందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement