చంద్రబాబు అలా ఎందుకు చెప్పడం లేదు: కొమ్మినేని | Kommineni Srinivasa Rao Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అలా ఎందుకు చెప్పడం లేదు: కొమ్మినేని

Oct 18 2023 8:57 AM | Updated on Oct 18 2023 9:43 AM

Kommineni Srinivasa Rao Comments On Chandrababu - Sakshi

: సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.

‘‘రాష్ట్ర దశాదిశను సీఎం జగన్ మార్చారు.. రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి వస్తున్నట్లు ఈనాడు పత్రికలోనే రాశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారు. ఆరోగ్య సురక్ష అద్భుతమైన పథకం. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం సీఎం జగన్‌కు చేతకాదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు.’’ అంటూ కొమ్మినేని ప్రశ్నించారు.

‘‘ఐటీని కనిపెట్టానన్న చంద్రబాబు ఇన్ఫోసిస్ లాంటి సంస్థను ఎందుకు విశాఖకు తేలేకపోయారు. రాష్ట్రంలో ఎల్లో మీడియా నీచంగా దిగజారిపోయింది. సీఎం జగన్ ధైర్యవంతుడు కాబట్టి ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నారు’’  కొమ్మినేని అన్నారు.
చదవండి: విశాఖ నుంచి పాలన: ప్రభుత్వ కార్యాలయాలు .. మిలీనియం టవర్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement