
చచ్చినా సరే కాపులను తాను విమర్శించనని రెండు దశాబ్దాల నా రాజకీయ గెలుపులో కాపు సోదరులు సగభాగం అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
సాక్షి, కృష్ణా జిల్లా: చచ్చినా సరే కాపులను తాను విమర్శించనని రెండు దశాబ్దాల నా రాజకీయ గెలుపులో కాపు సోదరులు సగభాగం అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తాను కాపు సామాజిక వర్గాన్ని విమర్శించినట్లు వస్తున్న ప్రచారంపై కొడాలి నాని స్పందించారు.
‘‘వంగవీటి రాధా నాకు సొంత తమ్ముడు లాంటివాడు. టీడీపీ కట్‌లు, పేస్ట్‌లు చేసి వదిలిన వీడియోపై జనసేన స్పందించింది. మహానాడు వేదికపై ఎన్టీఆర్ పక్కన పప్పు, తుప్పు ఫొటోలపై స్పందించా. వారసుడు బాలయ్య ఫొటో లేకపోయినా అచ్చెన్నాయుడు లాంటి స్క్రాప్‌గాడి ఫొటో ఎందుకని ప్రశ్నించా. వాళ్లు చూపిన అబద్ధాన్ని కాపు సోదరులు నమ్మలేదు. రేపు జనం కూడా టీడీపీని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నిచాతి నీచులు చేసిన మాయలో పడొద్దు’’ అని కొడాలి నాని అన్నారు.
చదవండి: బాబూ.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. మంత్రి కారుమూరి సవాల్