చంద్రబాబు.. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు? | EVMs Issue: Meruga Nagarjuna Takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు?

Oct 11 2024 12:17 PM | Updated on Oct 11 2024 12:48 PM

EVMs Issue: Meruga Nagarjuna Takes on Chandrababu Naidu

సాక్షి,తాడేపల్లి:  ఈవీఎంలపై మాట్లాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుందా? అని నిలదీశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు మేరుగ. గత ఎన్నికల తర్వాత ఈవీఎంలపై ప్రజలకు అనుమానం కల్గిందని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీపై ఉందన్నారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన మేరుగ.. ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయరు

‘విజయనగరంలో ఒక ఈవీఎం ఫుల్‌ చార్జింగ్‌తో ఉండటంతో మాకు అనుమానం వచ్చింది. ఒంగోలులో ఓట్ల విషయంలో కూడా అనుమానం వచ్చింది. దీనిపై మేము కోర్టుకు వెళ్లాం. హర్యానా ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాంటి అనుమానాలే ఉన్నాయని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం అని జగన్‌ అన్నారు. 

దీనిపై మేము ప్రశ్నిస్తే చంద్రబాబు కోప్పడుతున్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అని మేరుగ నాగార్జున మండిపడ్డారు.  సంపన్న దేశాలు సైతం బ్యాలెట్‌ వైపు మొగ్గుచూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా మేరుగ గుర్తు చేశారు. 

ఈవీఎంలపై చంద్రబాబు మాటల గారడీ.. సాక్ష్యాలు చూపిన మేరుగు నాగార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement