
తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ సమావేశం నిర్వహణకు షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్య వసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారులెవరూ క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది.