అశోక్‌ గెహ్లోత్‌ వర్గానికి హైకమాండ్‌ హెచ్చరిక

The Congress Has Issued Warning To Ashok Gehlot Loyalists - Sakshi

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ వర్గంపై ఆగ్రహం ‍వ్యక్తం చేసింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలపై బహిరంగ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ సెంట్రల్‌ లీడర్‌ కేసీ వేణుగోపాల్‌ లేఖ పంపారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష రేసు నుంచి గెహ్లోత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే హెచ్చరికలు పంపటం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘ఇతర నేతలకు వ్యతిరేకంగా, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగ ప్రకటనలు చేయటానికి దూరంగా ఉండాలని పార్టీనేతలకు సూచిస్తున్నాం. ఎవరైనా హైకమాండ్‌ హెచ్చరికలను బేఖాతరు చేస్తే పార్టీ నిబంధనల మేరకు కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని లేఖ రాశారు సీనియర్‌ నాయకుడు కేసీ వేణుగోపాల్‌. సచిన్‌ పైలట్ వర్గం నేత వేద్‌ ప్రకాశ్‌ సొలంకిపై ఆరోపణలు చేస్తూ గెహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ధర్మేంద్ర రాథోడ్‌ ఓ వీడియో విడుదల చేయటంపై ఇప్పటికే క్రమశిక్షణ నోటీసులు ఇచ్చింది హైకమాండ్‌. ఈ అంశంపై గెహ్లోత్‌ వర్గం విలేకరుల సమావేశం నిర్వహించిన కొద్ది సేపటికే.. హెచ్చరిక లేఖ పంపారు కేసీ వేణుగోపాల్‌.

ఇదీ చదవండి: దిగ్విజయ్‌తో థరూర్‌ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top