
సాక్షి, అమరావతి: 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉంటే తానే అధికారంలోకి వచ్చేవాడినని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పుడు, ఇప్పుడు ఆయన తనకు శ్రేయోభిలాషేనని తెలిపారు. చిరంజీవే కాకుండా సినీ పరిశ్రమలో అందరూ తనతో బాగానే ఉంటారని చెప్పారు.
టీడీపీ ఈ–పేపర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సినిమా టికెట్ల వివాదంలోకి తమను కూడా లాగుతున్నారన్నారు. సినిమా వాళ్లను తాము సమర్థిస్తున్నట్లు చెబుతున్నారని, అయితే సినీ పరిశ్రమ పూర్తిగా తనకు అండగా నిలబడలేదన్నారు. తనకు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు.