చట్టం చేశాక.. గుట్టు ఏముంటుంది!

Buggana Rajendranath Comments On Payyavula Keshav - Sakshi

పయ్యావుల వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి బుగ్గన

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ తీర్మానం, చట్టం చేసిన అంశాల్లో గుట్టు ఏముంటుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంపై పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చేసిన ఆరోపణలపై ఘాటైన సమాధానాలిచ్చారు. గురువారం ఢిల్లీలో మీడియాతో బుగ్గన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) చేసిన అప్పును చాలా గుట్టుగా ఉంచినట్టు, గ్యారెంటీలు, ఏ విధంగా తిరిగి కడుతున్నారనే విషయాలపై పయ్యావుల చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఇందులో గుట్టుగా చేయాల్సింది ఏముంటుంది. రుణం ఎందుకు తీసుకున్నామనే దానిపై అసెంబ్లీలోనే తీర్మానం చేసి, చట్టం చేయడం జరిగింది.

అమ్మ ఒడి, మహిళలకు ఆసరా, చేయూత వంటి నాలుగు పథకాలకు తీసుకోవడం జరిగింది. అదే నాలుగు కార్యక్రమాలకు ఆ డబ్బు వాడటం జరిగింది, దాంట్లో సీక్రెసీ ఏముంది.  వివిధ జీవోలు విడుదల చేశాం. ఇంక దాంట్లో గుట్టు ఏముం ది’ అని ప్రశ్నించారు. గ్యారెంటీ ఇవ్వలేదని అంటున్నారు. అగ్రిమెంట్‌ చదివారా, అగ్రిమెంట్‌లో పాయింట్‌ నంబర్‌ 2.1 చూడండి. ఏదైనా గ్యారెంటీ రూపంలో అమలు కావాలంటే ఎప్పుడు అమలవుతుందనేది తెలుసుకోండి’ అని పయ్యావులకు హితవు పలికారు. ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం సివిల్‌ సప్లయిస్‌ విభాగం ద్వారా రూ.5 వేల కోట్లు తీసుకుని పసుపు కుంకుమ పథకం కింద పంచిందని, ఆ మొత్తాన్ని ఈ ప్రభుత్వం చెల్లించడం లేదా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు.  

రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చేది రాజకీయాలు చేయడానికి, కేంద్ర మంత్రుల్ని  కలవడానికి మాత్రమే కాదని..  విద్యావంతులు, ఆర్థిక వేత్తలతో సమావేశం అవుతా రని పేర్కొన్నారు. ఎవరి అనుమతి తీసుకొని ఢిల్లీకి రావాలని ప్రశ్నించారు. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపిస్తున్నారు..వారి సొ మ్ములతో చక్కర్లు కొడుతున్నామా..హోటల్‌లో బస చేస్తున్నట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. బాధ్యతగా ఆరోపణలు చేయాలని హితవు పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్‌ సభ్యుడు అవినాశ్‌ మిశ్ర, నీతి ఆయోగ్‌ సీనియర్‌ సలహాదారు యోగేష్‌ సూరి, నీతి ఆయోగ్‌ సలహాదారు సీహెచ్‌పీ సారథిరెడ్డిలతో మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top