
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన లెటర్‌లో ఏముందో రేవంత్‌కు తెలియదని, కానీ ఆ లెటర్‌ను చూసి ఏదో సాధించినట్లు మురిసిపోతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘ కనీసం లెటర్ చదివే తెలివిలేదు సీఎం రేవంత్‌కు. సోనియా లెటర్‌లో ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసి పొయిండు. సోనియా గాంధీ తనకు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని… కానీ చదువు రాక రేవంత్ రెడ్డి పరవశించి పోతున్నాడు. రేవంత్ కార్యక్రమాని రాలేకపోతున్న అని సోనియా రాసిన లేఖలో ఒక్క మాటకూడా రేవంత్ పై ప్రశంసనే లేదు.
కార్యక్రమానికి రాలేను అన్న సోనియా మాటలే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అని చెప్పుకుంటున్నారు. రేవంత్‌ను చూస్తూ జాలేస్తుంది’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
మిత్తి సహా చెల్లిస్తాం
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమపై విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అడిగితే డైవర్షన్ చేయడానికి అనవసరపు మాటలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసుల్ని హెచ్చరించారు. ఈసారి ఎవ్వడు అడ్డుకున్న కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.