
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే సీఎం రేవంత్ రెడ్డిలా దిగజారిన, దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరోకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో మాట్లాడితే అబద్ధాలు నిజాలు అయిపోవు అంటూ హితవు పలికారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా రేవంత్ ప్రవర్తించడంలేదని కామెంట్స్ చేశారు.
కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..
రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు.. అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు. అబద్దం కూడా సిగ్గుపడి మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన.
రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడు.
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు.
•అబద్దం కూడా సిగ్గుపడి మూసి దుంకి ఆత్మహత్య…— Harish Rao Thanneeru (@BRSHarish) August 15, 2024
దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద, నామీద అవాకులు చెవాకులు పేలాడు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు.
ఆగస్టు 15తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు.
సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజ స్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నాడు.
మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా?
ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి?
నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్‌ఎస్‌ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు అంటూ కౌంటరిచ్చారు.
హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తున్నావ్ అని తెగ బట్టలు చింపుకుంటున్న కాంగ్రెస్ సన్నాసులు.. ముందు హరీష్ రావు గారు ఏమన్నారో చెవులు పెద్దగ చేసుకొని వినాలి.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రూ. 2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికి ఆగష్టు 15లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి… pic.twitter.com/T3xsdTfUeD— Jagan Reddy (@JaganReddyBRS) August 15, 2024