పాపపు పాలనలో ప్రతీ బిడ్డా ఆగమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | BRS KTR Serious Comments On Revanth Reddy Congress Govt Over TGEJAC Protests, Check Out More Details | Sakshi
Sakshi News home page

పాపపు పాలనలో ప్రతీ బిడ్డా ఆగమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Oct 24 2024 7:44 AM | Updated on Oct 24 2024 10:22 AM

 BRS KTR Serious On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ పాలనపై మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కాంగ్రెస్‌ పాలనలో సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పై​కి వచ్చారని కామెంట్స్‌ చేశారు.

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే. సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే. అడ్డగోలు సాకులతో సస్పెన్షన్‌లు-హక్కులు అడిగితే వేటేయ్యడాలు. రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు-ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్. 165 ఏఈవో లు 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం.

బీఆర్ఎస్ అంటే  ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం-కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement