ఢిల్లీ గల్లీలో కొత్త నాటకం.. రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్లు | BRS KTR Satirical Comments On CM Revanth Reddy Over Promises Given During Elections | Sakshi
Sakshi News home page

ఢిల్లీ గల్లీలో కొత్త నాటకం.. రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్లు

Jan 17 2025 10:01 AM | Updated on Jan 17 2025 11:53 AM

BRS KTR Satirical Comments On CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌(Congress) సర్కార్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR). పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గానీ.. అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది ముఖ్యమం‍త్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహారం అంటూ విమర్శించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి.. ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి?.. గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి?. నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు?. తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు?.

రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ?. ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ?. రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ?. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ?. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?. ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement