‘పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు’ | BJP Ramchander Rao Key Comments On Musi Project | Sakshi
Sakshi News home page

‘పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు’

Mar 22 2026 4:16 PM | Updated on Mar 22 2026 4:53 PM

BJP Ramchander Rao Key Comments On Musi Project

హైదరాబాద్‌:  మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు స్పష్టం చేశారు. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ చేసే అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే ఉంటుందని విమర్శించారు. లక్షన్నర కోట్ల రూపాయిలతో కేసీఆర్‌ కాళేశ్వరం అంటే,.. ఇప్పుడు రేవంత్‌ మూసేశ్వరం అంటున్నారని సెటైర్లు వేశారు.

ఆదివారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మూసీ పునరుజ్జీవం-వాస్తవాలు అంశంపై రాంచందర్‌ రావు అధ్యక్షతను చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్‌ రావు మాట్లాడుతూ.. ఎ‍న్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే నిధులు లేవంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరి మూసీ ప్రక్షాళనకు ినిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అని ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement