టీఆర్‌ఎస్‌లో త్వరలో అసమ్మతి బాంబ్‌ బ్లాస్ట్‌: మురళీధర్‌రావు 

BJP Muralidhar Rao Comments On TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో అసమ్మతి బాంబ్‌ త్వరలోనే పేలబోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆపార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో రాబోతున్న భూకంపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేస్తే ఆగదని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ యుద్ధంలో కేసీఆర్‌కు ఓటమి తథ్యమని తేలిందన్నారు. ఈడీ తలుపులు తట్టే దూరం ఎంతో లేదని పసిగట్టిన కేసీఆర్‌.. ముందే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే నీతి ఆయోగ్‌ నిరర్థకమని చెప్పి ఆ సమావేశాన్ని కేసీఆర్‌ బహిష్కరించారన్నారు. 

ఇది కూడా చదవండి: ఈసారి బీజేపీ నుంచి పోటీ తప్పదా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top