ప్రజావైద్యాన్ని గాలికొదిలేశారు 

Bhatti Vikramarka Visited Government Hospitals At Adilabad - Sakshi

సర్కార్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజం 

ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఆస్పత్రుల సందర్శన

ఆదిలాబాద్‌ రూరల్‌: ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.  శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ను, అలాగే నిజామాబాద్‌ ప్రభుత్వాస్ప తిని ఆయన సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రిమ్స్‌ ఆసుపత్రిలో 100 వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు.  రిమ్స్‌ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ మెషీన్‌ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి చెరువులు, స్థలాల ఆక్రమణలపై దృష్టి తప్ప వైద్యసేవలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు.   

ఉత్సవ విగ్రహంగా ఈటల 
నిజామాబాద్‌ అర్బన్‌: మంత్రి ఈటల రాజేందర్‌ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని భట్టి   ఎద్దేవా చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోందో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.  ఇతర మంత్రులను సీఎం భజనబ్యాచ్‌ల మార్చారని భట్టి  విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top