Bandi Sanjay Questions KCR Why Did Not Come To PM Modi Meeting - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కోసం ఎదురుచూశాం.. శాలువా కూడా తెచ్చా: బండి సంజయ్‌

Apr 8 2023 2:29 PM | Updated on Apr 8 2023 3:34 PM

Bandi Sanjay Questions KCR Why Did Not Come To PM Modi Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏంటని, నేటి సీఎం షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కోసం ఎదురు చూశానన్న సంజయ్... ఆయనను సన్మానించేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని సెటైర్లు వేశారు.  దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు  వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని నిప్పులు చెరిగారు

‘తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదు. దేశ ప్రధానికి రాష్ట్రానికి వస్తే కేసీఆర్‌ ఎందుకు రాలేదు.  కేసీఆర్‌ అభివృద్ధి నిరోధకుడిగా మారాడు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. కానీ  రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదు’ అని ఆరోపించారు.
చదవండి: కేసీఆర్‌ పేరు ప్రస్తావించకుండా ప్రధాని మోదీ చురకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement