AP Political News Jan 2nd: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Political News Jan 2nd: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Tue, Jan 2 2024 7:09 AM

AP Elections Political News Updates And Headlines On 2nd Jan 2024 In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

గెలుపే లక్ష్యంగా.. వైఎస్సార్‌సీపీ రెండో జాబితా

 • వైనాట్‌ 175 కు సీఎం జగన్‌ పిలుపు
 • ఇదే పిలుపుతో ఎన్నికల సమరానికి వైఎస్సార్‌సీపీ
 • సామాజిక సమీకరణాలు.. ఇతర కారణాల దృష్ట్యా పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పు
 • తొలి జాబితాలో 11 మంది.. తాజాగా 27 మందితో రెండో జాబితా విడుదల
 • గెలుపే ప్రమాణికంగా రెండో జాబితా విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ
 • జాబితా ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

YSRCPలో చేరిన బళ్లారి మాజీ ఎంపీ శాంతమ్మ

 • సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బళ్లారి మాజీ ఎంపీ శాంతమ్మ
 • గతంలో బీజేపీ ఎంపీగా పని చేసిన శాంతమ్మ
 • జే. శాంత స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్లు
 • వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జే. శాంత 2009 లో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నిక
 • ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన శాంత

శాంత, మాజీ ఎంపి

 • YSRCP సిద్దాంతాలు చూసి పార్టీలో జాయిన్ అవుతున్నా
 • దేశంలో ఎవరూ చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారు
 • ఇకనుండి ఒక సామాన్య కార్యకర్తగా YSRCPలో పని చేస్తాను
 • ప్రతి ఒక్కరికీ నేను తోడుంటాను
 • అందరం కలిసి జగన్ అన్నకు అండగా ఉందాం
 • సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు దేశమంతటా తెలుసు
 • ఒక ఇంటికి పెద్దకొడుకు ఎలా బాధ్యతగా ఉంటారో జగన్ అలా పని చేస్తున్నారు
 • ఏపీ రాష్ట్రం జగన్ పాలనకు జై కొట్టింది
 • అలాంటి పార్టీలో నేను కూడా ఒక సైనికురాలిగా పని చేస్తా
 • సామాన్య కార్యకర్తగా పార్టీలో పని చేయటానికి వచ్చాను
 • నేను ఒక బీసీ వర్గానికి చెందిన మహిళని
 • వాల్మీకి కులానికి గతంలో ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు
 • జగన్ మాత్రమే వాల్మికీలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు

ఎన్నికలొస్తున్నాయి.. కిం కర్తవ్యం..: చంద్రబాబు మంత్రాంగం

 • ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టిడిపిలో పెరుగుతున్న హీట్‌
 • ఏం చేయాలి, ఏం చెబితే జనం నమ్ముతారు?
 • వచ్చిన ప్రతీ ముఖ్యనేతకు ఇదే పరీక్ష పెడుతోన్న చంద్రబాబు
 • ఈనెల 5 నుంచి 29 వరకూ పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు సభలు
 • 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు

మళ్లీ ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటే ఎలా ఉంటుంది? : చంద్రబాబు

 • ఎన్టీఆర్ ఇచ్చిన ‘‘రా కదలి రా’’ పిలుపుతో మరోసారి ప్రచారం
 • 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో సభ
 • ‘‘రా కదలి రా’’ పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు
 • ఎన్నికల కోసం సోషల్‌ మీడియాలో తంటాలు
 • తెలుగుదేశం-జనసేన ఎన్నికల గుర్తులు..  సైకిల్-గాజు గ్లాసుతో ఓ కొత్త బొమ్మ
 • బీసీల ఓట్ల కోసం 4న జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు
 • ఇంకా పవన్ కళ్యాణ్‌ తేదీలపై రాని స్పష్టత
 • బాబు-పవన్‌ ఎప్పుడు కలిసి పాల్గొంటారన్న దానిపై తర్వాత ప్రకటనలు చేస్తామంటున్న టిడిపి
 • YSRCP నుంచి ఎవరెవరు వస్తారన్నదానిపై ఎదురుచూపులు
 • కొత్త, పాత వారి సమన్వయం కోసం కమిటీ పనిచేస్తోందన్న అచ్చెన్నాయుడు

అవి ఎల్లో మీడియా వార్తలే : YV సుబ్బారెడ్డి

 • జగన్ తరఫున షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు దుష్ప్రచారం
 • నేను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదు
 • నేను అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుతా
 • మేము రాయబారాలు చేయాల్సిన పనిలేదు
 • ప్రజలే జగన్ ను మరోసారి ఆశీర్వదించి సీఎం చేస్తారు
 • షర్మిల కాంగ్రెస్ లో చేరుతారో లేదో సమాచారం లేదు
 • షర్మిల కాంగ్రెస్ లో చేరినా YSRCPకి ఇబ్బంది లేదు
 • YSRCP నష్టపోకుండా అభ్యర్థుల మార్పు
 • వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతో సీట్ల మార్పు
 • వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు పొందేందుకే మార్పులు
 • కొందరు ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం
 • వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీలు మారుతున్నారు
 • వ్యక్తిగత కారణాలతో షర్మిల వెంట వెళ్లాలని ఆర్కే నిర్ణయం
 • పార్టీలో అందరికీ న్యాయం చేయడం సాధ్యపడదు
 • గెలుపు అవకాశాలు, అభ్యర్థి పై వ్యతిరేకత మేరకు సీట్ల మార్పు
 • ఎన్ని సీట్లలో మార్పులుంటాయనేది ఇప్పుడే చెప్పలేం

ఖమ్మం లేదా నల్గొండ : ఎంపీ కోసం పోటీ చేస్తా

 • కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి ముహూర్తం ఖరారు
 • ఎల్లుండి హస్తిన వేదికగా హస్తం పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం
 • పార్టీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత షర్మిల విలీన ప్రకటన
 • తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తానన్న షర్మిల
 • షర్మిలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తామని అధిష్ఠానం హామీ
 • ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటన

పవన్‌ + చంద్రబాబు = సున్నా

 • పవన్‌ కళ్యాణ్‌, జనసేనలపై కాపు సంఘం దాసరి రాము ఫైర్
 • గతి లేక టీడీపీ కాళ్లు పట్టుకున్నట్లుంది పవన్‌ పరిస్థితి
 • జనసేనకు 20 సీట్లు ఇస్తామన్నారు టీడీపీ వాళ్లు
 • అధికారపక్షంతో పవన్‌ కళ్యాణ్‌కు ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేక వ్యక్తిగత గొడవలు ఉన్నాయా?
 • YSRCPకి పవన్‌ వ్యతిరేకంగా వెళ్లాల్సిన పనేంటి? కాపులంతా ఎందుకు వ్యతిరేకించాలి?
 • టీడీపీ క్యాండిడేట్లే  జనసేన తరఫున పోటీ చేస్తారు
 • చచ్చిపోయిన టీడీపీని బతికించాల్సిన అవసరం కాపులకు లేదు
 • టీడీపీతో కలవకుండా విడిగా పోటీచేయమని ప్రధాని మోదీ చెప్పారు అయినా పవన్ కళ్యాణ్‌ వినలేదు
 • పవన్‌కు ప్యాకేజీ ఇచ్చామని మొదట ప్రచారం చేసింది చంద్రబాబే
 • నాదెండ్ల మనోహర్‌ చౌదరి లాంటి వ్యక్తిని తెచ్చి జనసేన పార్టీలో పెట్టుకున్నారు
 • సీఎం పవర్‌ షేరింగ్‌ లేకపోతే కాపులెవరు ఓట్లు వేయరు
 • లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి
 • యూట్యూబ్‌ చానల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కాపు సంఘం నేత దాసరి రాము


మళ్లీ నారాయణను ఓడిస్తా: ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

 • నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నా
 • మాజీ మంత్రి నారాయణకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి
 • వాళ్లలా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని కాను
 • మళ్లీ నారాయణను ఓడించి తీరతా

అలాంటి వాళ్లు వెళ్లిపోవడమే మంచిది: మంత్రి అమర్నాథ్‌

 • దాడి వీరభద్రరావు కుటుంబం వైఎస్సార్‌సీపీని  వీడటంపై స్పందించిన ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్
 • వైఎస్ఆర్సిపిలో గెలిచే వారికి సీట్లు 
 • కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదు
 • గడిచిన కొన్ని రోజుల క్రితం కొన్ని నియోజక వర్గాల్లో సమన్వయ కర్తల  పేర్లు ప్రకటించారు
 • అప్పటి నుంచి చర్చ మొదలైంది
 • సీటు ఇస్తేనే వుంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో వుండోద్దని స్పష్టం గా  పార్టీ చెప్పింది
 • ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి  కూడా చెప్పారు.
 • ఎన్నికల వేళ టికెట్లు రాని వ్యక్తులు పార్టీ కి దూరంగా ఉండటం వల్ల పార్టీ కి నష్టం లేదు
 • 175 సీట్లే ఏపీలో వున్నాయి.. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరు...
 • దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది
 • అప్పుడు తిరస్కరించారు.. ఆ విషయంలో వారిదే ఆఖరి నిర్ణయం
 • కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం  కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిది

జగన్ పాలనలోనే వాల్మీకిలకు ప్రాధాన్యం: మాజీ ఎంపీ శాంతమ్మ 

 • వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీ శాంతమ్మ
 • గతంలో బళ్లారి(కర్ణాటక) నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పని చేసిన జే. శాంత
 • వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు చూసి పార్టీలో జాయిన్ అవుతున్నా
 • దేశంలో ఎవరూ చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారు
 • ఇక నుండి ఒక సామాన్య కార్యకర్తగా వైసీపిలో పని చేస్తాను 
 • ప్రతి ఒక్కరికీ నేను తోడుంటాను
 • అందరం కలిసి జగన్ కి అండగా ఉందాం
 • జగన్ చేస్తున్న మంచి పనులు దేశమంతటా తెలుసు
 • ఒక ఇంటికి పెద్దకొడుకు ఎలా బాధ్యతగా ఉంటారో జగన్ అలా పని చేస్తున్నారు
 • ఏపీ రాష్ట్రం జగన్ పాలనకు దాసోహం అంటోంది 
 • అలాంటి పార్టీలో నేను కూడా ఒక సైనికురాలిగా పని చేస్తా
 • సామాన్య కార్యకర్తగా పార్టీలో పని చేయటానికి వచ్చాను
 • నేను ఒక బీసీ వర్గానికి చెందిన మహిళని
 • వాల్మీకి కులానికి గతంలో ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు
 • జగన్ మాత్రమే వాల్మీకిలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు


ఆ ప్రచారం.. ఎల్లో మీడియా దిగజారుడుతనానికి పరాకాష్ట

 • ఎల్లో మీడియా అసత్య ప్రచారాన్ని ఖండించిన వైఎస్సార్‌సీపీ రీజనల్ ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి
 • ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదు
 • సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు
 • ఇది చూడలేక ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారు
 • చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారు
 • రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా
 • కుటుంబ సభ్యులను కలుస్తుంటా
 • విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను
 • కానీ ఎల్లోమీడియా రాతలు వారి దిగజారుడుతనానికి.. పరాకాష్ఠకు నిదర్శనం
 • వైఎస్‌ కుటుంబ సభ్యులను కూడా బజారుకీడ్చే పని చేస్తున్నారు
 • వీరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది
 • జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల‌ కుటుంబాల్లో మార్పు వచ్చింది
 • షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు
 • ఈమధ్య కాంగ్రెస్ లో చేరుతున్నారని కూడా వార్తలు వచ్చాయి
 • దానిపై మాకు క్లారిటీ లేదు
 • షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఇండదు 
 • మాకు ప్రజల మద్దతు ఉంది.. ప్రజలే మాకు దేవుళ్లు 
 • 175 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నాం 
 • ఒక్కోచోట సీటు ఇవ్వలేకపోతే వేరేది చూస్తామని కూడా చెప్తున్నాం
 • సీట్ల విషయంలో అందరికీ నచ్చచెప్తున్నాం 
 • దాడి వీరభద్రంతో చర్చించాం
 • కానీ, ఆయన తొందరపడి రాజీనామా చేశారు
 • అనకాపల్లిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి
 • ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు
 • ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయి

తెలంగాణలో జనసేతో బీజేపీ పొత్తు ఉండదు: కిషన్‌రెడ్డి

 • 17 పార్లమెంట్‌ స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేస్తాం.
 •  జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది.
 • ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదు.

01:38 AM, Jan 2, 2024
వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకులు

 • భీమవరంలోని పలు వార్డుల జన సేన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకిలోకి చేరిక
 • వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే  గ్రంథి శ్రీనివాస్
 • పవన్ కళ్యాణ్‌కు పౌరుషం, ఆత్మాభిమానం లేదని సొంత సామాజిక వర్గం భావిస్తుంది: గ్రంథి శ్రీనివాస్‌
 • డిప్యూటీ సీఎం పదవి కూడా టీడీపీ పొలిటి బ్యూరో, చంద్రబాబు చేతిలో ఉందని లోకేష్ మాట్లాడటంపై జన సైనికులు ఆలోచించుకోవాలి
 • ఆత్మాభిమానం గల జనసైనికులు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు

10:39 AM, Jan 2, 2024
నారాయణపై మాజీ మంత్రి అనిల్‌ మండిపాటు

 • టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకునేందుకు మాజీ మంత్రి నారాయణ  ఓ ఇద్దరు నేతలకు రూ.50 కోట్లు ఇచ్చారు
 • పార్టీ నుంచి టికెట్ కూడా తెచ్చుకోలేని దుస్థితిలో  నారాయణ
 • నారాయణని రెండోసారి కూడా ఓడించేది నేనే
 • టీడీపీ హయాంలో నెల్లూరులో అభివృద్ధి శూన్యం

10:16 AM, Jan 2, 2024
ఆర్జీవీ ఫిర్యాదుపై దర్యాప్తు ముమ్మరం​ చేసిన ఏపీ సీఐడీ

 • కొలికపూడి శ్రీనివాసరావు, యాంకర్‌ సాంబశివరావుకు నోటీసులు
 • రేపు మంగళగిరిలో సీఐడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశం
 • ఆర్జీవీ తలనరికితే రూ.కోటి బహుమతి అంటూ కొలికపూడి ప్రకటన
 • నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
 • వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు
 • ఓ టీవీ యాజమాన్యం సహా, ఆరుగురిపై కేసులు నమోదు

8:09 AM, Jan 2, 2024
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!

 • కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు గెడ్లబీడులో టీడీపీ నూతన సంవత్సర వేడుకలు
 • వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దు­కుని బాహాబాహీ
 • వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామ­కృష్ణుడి కుమార్తె)
 • వారికి నాయకులు, కార్య­కర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు
 • కొంత సమయం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన దివ్య
 • తొండంగి మండలం నుంచి అను­చరులతో తరలివచ్చిన యనమల రాజేష్‌
 • రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్‌ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ అడ్డుకున్న కృష్ణుడి వర్గీయులు
 • దీనిపై ఆగ్ర­హం చెందిన రాజేష్‌ వర్గీయులు ..ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నం..
 • ఈ క్రమంలో రాజేష్‌, కృష్ణుడి వర్గీ­యు­­ల మధ్య తోపులాట

07:36 AM, Jan 2, 2024
ఒకే జిల్లాలో 61వేల కొత్త ఓట్లు

 • కొత్త ఓట్లలో యువతవే 80 శాతం!
 • బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు 61,193 కొత్త ఓట్లు
 • అద్దంకి నుంచి అత్యధికంగా 12,883 ఓట్లు
 • బాపట్లలో 9,967, రేపల్లెలో 9,961, చీరాలలో 9,958
 • తొలగించిన ఓట్లు 46,116
 • అత్యధికంగా పర్చూరు నుంచి 10,468 ఓట్ల తొలగింపు
 • రేపల్లెలో 8,880, చీరాలలో 7,420, అద్దంకిలో 7,207 తొలగింపు
 • పరిశీలనలో మరో 600 దరఖాస్తులు
 • జనవరి 12 వరకూ పరిశీలన.. 22న తుది జాబితా

07:20 AM, Jan 2, 2024
అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని చూసి.. ఇప్పుడు నీతులు చెబుతావా లోకేష్‌

 • మేము అగ్రి గోల్డ్ బాధితులకు 7 కోట్లు (ఆత్మహత్య చేసుకున్న 142  మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ) ఇచ్చాం: లోకేష్‌
 • రాష్ట్రంలో 11 .57  లక్షల  మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్‌ సంస్థలో  డిపాజిట్‌ చేశారు
 • వారిలో 20 వేలు లోపు డిపాజిట్‌ చేసినవారికి  "930 కోట్లు చెల్లించి" 10.37లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారు సీఎం జగన్ 
 • మిగిలిన వారికి కూడా డిపాజిట్‌ మొత్తం చెల్లించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది
 • అగ్రి గోల్డ్ ఆస్తులను ఈడీ   అటాచ్ చేయడం తో ఏలూరు  కోర్ట్ లో కేసు వేసి పోరాడుతోంది జగన్ ప్రభుత్వం
 • అసలు అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే
 • అగ్రిగోల్డ్‌ సంస్థ 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది
 • అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పంతం పట్టారు
 • టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి
 • అందుకోసం అగ్రిగోల్డ్‌ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది
 • ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది
 • అగ్రిగోల్డ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016 ఏప్రిల్‌ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం
 • అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీ అయిన రామ్‌ ఆవాస్‌ రిసార్ట్స్, హోటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకర్‌ నుంచి 14 ఎకరాలు కొన్నది
 • అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు
 • రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు
   

07:10 AM, Jan 2, 2024
పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు

 • మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి 
 • గుంటూరులో అర్ధరాత్రి అరాచకం..
 • న్యూఇయర్‌ వేడుకల ముసుగులో టీడీపీ, జనసేన మూకల ర్యాలీ.. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా నినాదాలు
 • మంత్రి రజిని నూతన కార్యాలయంపై రాళ్లతో దాడి
 • అడ్డుకున్న పోలీసులపైనా దౌర్జన్యం.. సెక్యూరిటీ గార్డుపై దాడి.. పోలీసుల అదుపులో 30 మంది 
 • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 
 • ఈ దాడిలో 100మందికి పైగా పాల్గొన్నట్లు పోలీసుల నిర్ధారణ 
 • ఓటమి భయంతోనే దాడులు : మంత్రి రజిని  

Advertisement
 
Advertisement