కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా?

Anil Kumar Yadav Comments On TDP Over Attack On Temples - Sakshi

సాక్షి, తాడేపల్లి :  దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌ స్పష్టంగా వివరణ ఇచ్చారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం వారిలో కనిపించిందన్నారు. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారని, గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి అనిల్‌ శనివారం మాట్లాడుతూ.. విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ నిజాలు బయటకు రాకూడదని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఎవరికి లాభం అన్నది అందరికీ అర్థం అవుతుందన్నారు. ఇవన్నీ దురుద్దేశాలతో రాజకీయాల కోసం చేసినవిగా కనిపిస్తున్నాయని విమర్శించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి బిగ్‌షాక్‌.. బీజేపీలోకి కీలక నేత!

‘అన్ని కేసుల్లో మీ పాత్ర ఉందని చెప్పలేదు కదా. కొన్నింటిలో మీ పాత్ర ఉంది. మేము కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా..? దురుద్దేశం మీకుందా..? మాకుందా..? అఖిలప్రియ కేసులో స్పందనే లేదు..కానీ ఈ 9 కేసులపై మాట్లాడుతున్నారు. 9 కేసుల్లో ఉన్న వారు మీవారు కాదా...? గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలరా..? పలు సంఘటనల్లో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ వారిది కాదా..? రాజమండ్రి వినాయక విగ్రహానికి అపవిత్రం చేశారన్న కేసులో బుచ్చియ్య చౌదరి అనుచరులు కాదా..? తిత్లీ తుఫానులో విగ్రహం దెబ్బ తినడాన్ని ఓ బీజేపీ నేత దుష్ప్రచారం చేశారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచ చరిత్ర నీకుంది. విగ్రహాలు పగలగొట్టొచ్చు కానీ వాస్తవాలు బయటకు వస్తుంటే నారా వారి నరాల్లో వణుకు పుడుతోంది. చదవండి: రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు పన్నాగం

ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని చెప్పి మా పై దాడి చేసే పరిస్థితి. భగవంతుడితో ఆడుకున్న వారు ఎవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. కనీసం ఈ రోజుకైనా ఆ టీడీపీ వారిని సస్పెండ్ చేశారా..? కరోనాలో ఎన్నో సంఘటనలు జరిగినా బయటకు రాలేదు. కానీ రాముని విగ్రహము అనగానే పరిగెత్తుకొచ్చాడు. కచ్చితంగా దీని వెనుక ఎదో కుట్ర దాగుంది. చంద్రబాబుకి ముందే తెలుసు. ఆయనికి ఆయన సొంత వర్గం తప్ప ఎవరి మీదా ప్రేమ లేదు’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top