సీఎంల భేటీపై ఎందుకంత గోప్యం? | Ambati Rambabu Comments On Chandrababu Naidu Over Meeting With Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎంల భేటీపై ఎందుకంత గోప్యం?

Jul 9 2024 6:10 AM | Updated on Jul 9 2024 6:16 AM

Ambati Rambabu Comments On Chandrababu Naidu Over Meeting With Revanth Reddy

సమావేశంలో చర్చించిన అంశాలను బహిర్గతం చేయాలి

టీటీడీ, పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందన్న వార్తలపై మౌనమెందుకు? 

పోలవరం ముంపు గ్రామాల విలీనాన్ని తెలంగాణ అడిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలి 

మరోసారి రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు 

హామీలను అమలుచేయకపోతే సామాన్యుడి గొంతుకై వైఎస్‌ జగన్‌ విజృంభిస్తారు 

సీఎం చంద్రబాబుకు మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక  

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి మధ్య ఇటీవల జరిగిన చర్చల అంశాలపై ఎందుకంత రహస్యమని మాజీమంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు. తక్షణమే చర్చల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో ఏడు ముంపు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదనతోపాటు.. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆదాయంలో, పోర్టుల్లో వాటా, కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం అడిగిందంటూ మీడియాలో వచి్చన వార్తలపై చంద్రబాబు స్పందించకపోవడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయన్నారు. దీంతో సీఎం చంద్రబాబు మరోసారి ఏపీకి తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అర్థమవుతోందని అంబటి మండిపడ్డారు. ఆయన ఇంకా  ఏమన్నారంటే..  

ఉమ్మడి రాజధాని నుంచి పారిపోయి ఎందుకొచ్చారు? 
రాష్ట్రం విడిపోయి పదేళ్లయింది. విభజన సమస్యలు అనేకం అపరిష్కృతంగా మిగిలిపోయాయి. దానివల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని అనేకసార్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజనానంతరం ఏపీని చంద్రబాబు అయిదేళ్లు పాలించారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే వెసులుబాటును సది్వనియోగం చేసుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారో చంద్రబాబు చెప్పాలి? ఓటుకు కోట్లు కేసులో తప్పుచేయడంతో చంద్రబాబును మెడపట్టి గెంటేశారు. ఆ కేసులో పీకల్లోతు కూరుకుపోయి భయంతో హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచి్చ, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. 

, 9, 10వ షెడ్యూల్, విభజన చట్టంలో ఉన్న ఆస్తుల పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడకుండా, చర్చలు జరపకుండా పారిపోయి వచ్చి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబే. హైదరాబాద్‌లో అన్ని ఆఫీసులను ఉన్నపళంగా ఖాళీచేసి.. ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టారు. అసలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు పదేళ్ల సమయం ఉంటే ఎందుకు తాత్కాలిక కట్టడాలు కట్టారన్నది చంద్రబాబు చెప్పాలి. ఇప్పుడు మళ్లీ సీఎం అయి మరో అన్యాయం చేయడానికి ఆయన ప్రయతి్నస్తున్నారు.

తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు ఏపీకి ద్రోహమా!?  
తెలంగాణ, ఏపీ రెండూ తనకు రెండు కళ్లు లాంటివని చంద్రబాబు అన్నారంటే.. దాని అర్థం సమానంగా చేసుకుంటాననే కదా.. అయితే,  తెలంగాణలో టీడీపీని బతికించుకోవడం కోసం ఆ రాష్ట్రం కోరే అసంబద్ధ కోర్కెలకు అంగీకరిస్తారా బాబూ? పార్టీ పరంగా రెండు రాష్ట్రాలూ ముఖ్యమని చెప్పుకుంటే తప్పులేదు.. కానీ, సీఎంగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానమంటే ఏపీకి ఏదో ద్రోహాన్ని తలపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.   

ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటా అడగడంపై మౌనమెందుకు? 
ఇక ఏపీకి సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇందులో తమకు వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగినట్లు అన్ని పత్రికల్లో, మీడియాలో వార్తలొచ్చాయి. టీటీడీ ఆదాయంలో 48 శాతం వాటా, అన్ని పోర్టుల్లోనూ వాటా, కృష్ణా జలాల్లోనూ వాటా కావాలని తెలంగాణ అడిగిందని వార్తలు వచ్చాయి.

అంతేకాక.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టం ప్రకారం ఏడు మండలాలను ఏపీలో కలిపారని, వాటిని వెనక్కు ఇచ్చేయాలని  అడిగినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రులెవరూ దీనిపై స్పందించలేదు. సమాధానం చెప్పకుండా వెళ్లారంటే ఇవన్నీ నిజమేనని అనుకోవాల్సి వస్తోంది. సీఎంల సమావేశానంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.  

 పోలవరానికి చంద్రబాబు ద్రోహం.. 
పోలవరం విషయానికి సంబంధించి చట్టంలో ఏపీకి, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు, తెలంగాణకు కొన్ని సమస్యలున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో ఉన్న వివాదాలు వైఎస్‌ జగన్‌ చొరవవల్ల దాదాపు పరిష్కార దశకు వచ్చాయి. పోలవరంవల్ల ఒడిశాకు, ఛత్తీస్‌గఢ్‌కు ముప్పు సమస్య ఉత్పన్నం కాదని కోర్టులో సీడబ్ల్యూసీ అఫిడవిట్‌ కూడా ఇచి్చంది. కానీ, ఇవాళ చంద్రబాబు తెలంగాణతో కొత్త సమస్య తీసుకొచ్చారు. ఏడు మండలాలను ఏపీలోకి విలీనం చేయడం చట్టంలో ఉంది. కానీ, తెలంగాణ అడిగిందని ఇవాళ మళ్లీ వాటిని ఇచ్చేసేలా పరిస్థితులు వచ్చాయి.

పోలవరానికి ద్రోహంచేసే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు.  ఒకే అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమవుతుందని నమ్మే చంద్రబాబు.. పోలవరం సంక్షోభంలోకి రావడానికి కారణం వైఎస్‌ జగన్‌ చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ వల్లేనని తరచూ ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి.. కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లనో, రివర్స్‌ టెండరింగ్‌ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదు. నష్టం జరిగిందల్లా చంద్రబాబు తెలివితక్కువతనంవల్లే. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా పనులు పూర్తిచేయకుండా.. డయాఫ్రం వాల్‌ వేసి కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం ప్రారంభించడంవల్లే విధ్వంసం చోటుచేసుకుంది.

ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి కాంట్రాక్టర్‌ను మార్చారు. దీనివల్లే విధ్వంసం జరిగిందని చంద్రబాబు తరచూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అసలు పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. దానిపై వచ్చే డబ్బులపైనే ఆయనకు ధ్యాస ఉందని సాక్షాత్తూ ప్రధాని మోదీనే అన్నారు. చంద్రబాబు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చకపోతే సామాన్యుడి గొంతుకై వైఎస్‌ జగన్‌ విజృంభిస్తారు. ఇక మహానేత వైఎస్‌ జయంతిని ఎవరైనా చేసుకోవచ్చు.  

విభజన సమస్యలపై మాట్లాడారా?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయి. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా లేదా న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. 9, 10వ షెడ్యూళ్లలో ఉన్న బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి. రూ.7 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలూ రావాలి. వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాం. కేంద్రం ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదు. ఈ అంశం న్యాయస్థానాల్లో ఉంది. దాని గురించి చంద్రబాబు ఇప్పుడు మాట్లాడటంలేదు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు రెండూ సరిహద్దుల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్యలపై చంద్రబాబు మాట్లాడారా? పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్లాలంటే 881 అడుగుల స్థాయిలో ఉంటే తప్ప వెళ్లవు. అక్కడిదాకా తెలంగాణ వాళ్లు నీళ్లను రానిస్తున్నారా? విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలంలో నీటిని తోడేస్తూ 881 అడుగుల స్థాయికి నీటిమట్టం రాకుండా చేస్తున్నారు. దీనివల్ల రాయలసీమ నష్టపోతోంది. ఈ సమస్య గురించి మాట్లాడారా చంద్రబాబూ? అలాగే, సాగర్‌లో కుడి కాలువకు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. తాళాలు వాళ్ల దగ్గర ఉన్నాయి. మన ప్రాంతం కూడా వాళ్ల స్వా«దీనంలోకి వెళ్లింది. 

 అసమర్థతవల్లే ఇలా వెళ్లింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచి్చన తర్వాత పోలీస్‌ యాక్షన్‌ ద్వారా మనం స్వా«దీనం చేసుకున్నాం. ఈ సమయంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని తొందరపడొద్దు.. మేం పరిష్కరిస్తాం అని హామీఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అప్పగించింది. దీని గురించి ఏమైనా చంద్రబాబు మాట్లాడారా? ఇక పోలవరంలో 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వచేస్తే భద్రాచలం మునిగిపోతుందని ఇంతకుముందు తెలంగాణ మంత్రులు మాట్లాడారు. ఇది కరెక్టు కాదు.

దీéని గురించి ఏమైనా చర్చించారా? డ్రగ్స్‌ గురించి మాట్లాడటానికి ఇంతమంది వెళ్లాలా చంద్రబాబూ? ఏదీ దొరక్క ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారా? విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక హోదా కోసం నల్ల దుస్తులు వేసుకుని అసెంబ్లీలో హడావుడి చేశారే.. ఇప్పుడు మీ మీద ఆధారపడేలా కేంద్ర ప్రభుత్వం వచి్చనా హోదా అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు బాబూ?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement