పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

● రామగుండం తహసీల్లార్‌ కార్యాలయం ఎదుట ● ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్‌గేట్‌, మేడిపల్లి సెంటర్‌, ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు ● గోదావరిఖని మున్సిపల్‌ ఆఫీస్‌ అంబేడ్కర్‌ టీ జంక్షన్‌, బీ గెస్ట్‌హౌస్‌ మూలమలుపు ● గంగానగర్‌ మిలీయం కార్టర్స్‌, ఫ్‌లైఓవర్‌ ● మల్యాపల్లి ఐఓసీ, బుగ్గరోడ్డు, ధర్మారం ఎక్స్‌రోడ్డు, అప్పన్నపేట, మంథని ప్లైఓవర్‌ ● చిన్నకల్వల, సుల్తానాబాద్‌ బస్టాండ్‌, కాట్నపల్లి క్రాస్‌రోడ్డు, గర్రెపల్లి, దుబ్బపల్లి.

గోదావరిఖని: అతివేగం.. ట్రాఫిక్‌ నిబంధనల ఉ ల్లంఘన.. మద్యం తాగి వాహనం నడపడం.. వెర సి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇందులో ద్విచక్ర వాహన ప్రమాదాలు అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

బ్లాక్‌స్పాట్లు గుర్తించినా..

జిల్లాలోని రాజీవ్‌ రహదారి వెంట పోలీసులు గతంలోనే బ్లాక్‌స్పాట్‌లు గుర్తించారు. ప్రమాదాల ని యంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతోనే అక్కడ ప్రమాదాలు ఇంకా పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. భారీ వాహనాలను ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారులు తమ ప్రాణాలు కోల్పోతుండగా.. గాయాలపాలైన చాలామంది శాశ్వతంగా అంగవైకల్యం చెందుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్‌కు అప్పగించారు. ఆరేళ్ల క్రితం బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రమాదాల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం సూచిక బోర్డులు లేక.. బ్లాక్‌ స్పాట్‌లు కనిపించక ప్రమాదాలు మళ్లీ పెరుగుతున్నాయి. నిద్రలేకపోవడం, అలసిపోవడంతో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు.

నియంత్రణపై దృష్టి

రామగుండం పోలీస్‌ కమిషరేట్‌లో శనివారం పె ద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో సీపీ అంబర్‌ కిశోర్‌ఝా సమావేశమయ్యా రు. జిల్లా సీసీసీలో జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. డంక్‌అండ్‌ డ్రైవ్‌, ఆకస్మిక తనిఖీలు, హైవేపై స్పీడ్‌గన్‌లు ఏర్పాటు చేయాలని సూచిండంతో పోలీస్‌ సిబ్బంది ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

రాజీవ్‌రహదారిపై బ్లాక్‌స్పాట్లు

ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు

2022 127 53 262

2023 113 65 300

2024 145 57 342

2025 137 38 338

2026 100 24 228

(ఆగస్టు)

గతేడాది..

ఈ – చలాన్ల ద్వారా వసూలు

4,12,253 కేసులు రూ.13.67కోట్లు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల వసూలు

9,678 కేసులు రూ.96.45లక్షలు

నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు

ట్రాఫిక్‌ నిబందనలు ఉల్లంఘిస్తూ అతివేగంగా డ్రైవింగ్‌ చేయడంతోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగ వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానం చేరాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు. ఇచ్చే వారిపై కేసులు నమోదు చేస్తాం.

– అంబర్‌ కిశోర్‌ ఝా, సీపీ, రామగుండం

గాలిలో కలుస్తున్న ప్రాణాలు

నిబంధనలు పాటించని వాహనదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement