వ్యసనాల విషయంలో రాజన్న సిరిసిల్ల ముందుంది. అక్కడ 52.1 శాతం పురుషులు మద్యం తాగుతున్నట్లు నమోదైంది. జగిత్యాలలో 47.6, పెద్దపల్లిలో 46, కరీంనగర్‌లో 40.4 శాతంగా ఉంది. కరీంనగర్‌లో మద్యం తాగే పురుషుల శాతం గతంలోని 49.8 నుంచి 40.4 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం. మహిళల్లో మద్యపానం సిరిసిల్లలో 8.7 శాతానికి చేరింది. గతంలో 6.1 శాతంగా ఉన్నది ఇప్పుడు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పొగాకు వినియోగించే పురుషులు సిరిసిల్లలో 22.1, జగిత్యాలలో 20.6, కరీంనగర్‌లో 20, పెద్దపల్లిలో 16.4 శాతంగా ఉన్నారు.


