డోజర్‌ను అడ్డుకున్న నిర్వాసితులు | - | Sakshi
Sakshi News home page

డోజర్‌ను అడ్డుకున్న నిర్వాసితులు

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

రామగిరి: గ్రామావసరాల కోసం కేటాయించిన స్థ లంలో సింగరేణి చేపట్టిన వివిధ పనులను నిర్వాసితులు, గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా స్థలాన్ని సింగరేణి అ ధికారులు తమ అధీనంలోకి తీసుకుంటూ కంచె ఏ ర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామదేవత పో చమ్మతల్లి గుడి, పిల్లలు ఆడుకునే మైదానం, గ్రామస్తులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన న ర్సరీ స్థలాలు సైతం సింగరేణి పరిధిలోకి వెళ్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల నాయ కుడు బర్ల శ్రీనివాస్‌, లద్నాపూర్‌ ఒకటోవార్డు సభ్యురాలు చిప్ప లావణ్యతోపాటు వార్డు ప్రజలు, గ్రామస్తులు, నిర్వాసితులు అక్కడికి చేరుకుని డోజర్‌ను అడ్డుకుని పనులు నిలిపివేశారు. గ్రామానికి కేటాయించిన స్థలంలో ఎలాంటి కంచె పనులు చేపట్టవద్దని సింగరేణి అధికారులకు సూచించారు. సమీపంలోని ఇళ్ల కాంపౌండ్‌లను కూడా డోజర్‌తో కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపించారు.

భూములు ఇచ్చాం..

ఊరు స్థలాలనూ తీసుకుంటారా?

సింగరేణి కోసం ఇప్పటికే గ్రామానికి చెందిన వందలాది ఎకరాలు, ఇళ్లు కోల్పోయామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములతోపాటు జీవనాధారాన్ని కోల్పోయిన తమకు అవసరాల కోసం మిగిలిన స్థలాలే ఆధారమని తెలిపారు. గ్రామ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించాలని వారు అధికారులను కోరారు.

హక్కుల కోసం పోరాటం

గ్రామానికి కేటాయించిన స్థలాలను సింగరేణి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బర్ల శ్రీనివాస్‌ అన్నారు. పనులు కొనసాగిస్తే గ్రామస్తులంతా కలిసి అడ్డుకుంటామని, అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేపట్టి హక్కుల కోసం పోరాడతామని ఆయన హెచ్చరించారు. సింగరేణి అధికారులు గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement